ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ కి పూలమాల వేస్తున్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా ?, ఫొటోను పరిశీలిస్తుంటే ఎన్టీఆర్ వీరాభిమాని అనిపిస్తోంది కదా ? అప్పటి ఈ అబ్బాయి, ఇప్పటి దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎన్వీ రమణకు ఏదో పురస్కారం రావడం, అది ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. .
ఆ క్షణంలో తీసిన ఈ అపురూపమైన ఫోటో అప్పటి ఫోటో. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎన్వీ రమణగారు సీనియర్ ఎన్టీఆర్ గారికి అభిమాని అని, ఎన్టీఆర్ మీద అభిమానంతోనే అప్పట్లో తెలుగు దేశం కోసం ఆయన పని చేశారని ఇలా ఎవరికీ తోచింది వాళ్ళు కామెంట్ల రూపంలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఏది ఏమైనా ఈ ఫోటో ఆసక్తికరంగా ఉండటం, ఫొటోలో రమణగారు మరి యంగ్ గా కనిపించడంతో ఇంకా ఆసక్తిని పెంచుతోంది. ఇక ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఎన్‌వీ రమణగారి పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. ఆయనది కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామం. ఆయన 1957లో ఆగస్టు 27న జన్మించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం, చిన్నప్పటి నుండి ఆయన ఎన్టీఆర్ సినిమాలను ఎక్కువగా చూసేవారట.
ఇక 1983లో ఎన్వీ రమణ న్యాయవాదిగా తన కెరీర్ ను ప్రారంభించి.. నేడు దేశంలోనే ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు, ఎన్వీ రమణను బాగా ప్రోత్సహించారు. అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా ఎన్వీ రమణకు పదవిని ఇచ్చారు. అప్పటి నుండే చంద్రబాబు నాయుడు, జస్టిస్ రమణల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.
ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం కారణంగా రమణకు తెలుగు దేశం పై ఇష్టం ఏర్పడిందని, ఆ ఇష్టం వల్ల చంద్రబాబుతో స్నేహం కుదిరిందని తెలుస్తోంది. ఇక జస్టిస్ ఎన్వీ రమణ, తెలుగు దేశానికీ సంబంధించిన కేసుల్లో న్యాయ స్థానాల్లో ఫేవర్ గా తీర్పు వచ్చేలా చేస్తున్నారని ఆయన పై జగన్ ఎన్నో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rare pic nv ramana with sr ntr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com