https://oktelugu.com/

Rangamarthanda trailer review : రంగమార్తాండ ట్రైలర్ రివ్యూ: ‘తప్పుడు నా కొడకా’ ప్రకాష్ రాజ్ ని బండ బూతులు తిట్టిన బ్రహ్మానందం!

Rangamarthanda trailer review :  దర్శకుడు కృష్ణవంశీ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాల్లో పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ఎమోషన్స్ లోతుగా పలుకుతాయి. ఆయన మేకింగ్ స్టైల్ వేరు. టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్స్ లో ఆయన కూడా ఒకరు. అయితే కొన్నాళ్లుగా ఆయన ఫార్మ్ కోల్పోయారు. ఆయన స్థాయి సినిమా వచ్చి, హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2017లో నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేశారు. అప్పటి నుండి […]

Written By: , Updated On : March 20, 2023 / 08:22 PM IST
Follow us on

Rangamarthanda Trailer | Prakash Raj | Brahmanandam | Ramya Krishnan | Ilaiyaraaja | Krishna Vamsi

Rangamarthanda trailer review :  దర్శకుడు కృష్ణవంశీ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాల్లో పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ఎమోషన్స్ లోతుగా పలుకుతాయి. ఆయన మేకింగ్ స్టైల్ వేరు. టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్స్ లో ఆయన కూడా ఒకరు. అయితే కొన్నాళ్లుగా ఆయన ఫార్మ్ కోల్పోయారు. ఆయన స్థాయి సినిమా వచ్చి, హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2017లో నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేశారు. అప్పటి నుండి దాదాపు ఆరేళ్ళ గ్యాప్ అనంతరం రంగమార్తాండ చిత్రం చేశారు.

రంగమార్తాండ ఒక రీమేక్. సాధారణంగా ఆయన రీమేక్స్ జోలికి పోడు. ఈసారి మరొకరి కథను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఉగాది కానుకగా రంగమార్తాండ విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల ట్రైలర్ నెమ్మదిగా సాగింది. ట్రైలర్ గమనిస్తే… ఇది ఒక కళాకారుడి కథ. రంగస్థల నటుడిగా తిరుగులేని గౌరవం అందుకున్న రాఘవరావు ప్రయాణం. సన్మానాలు, సత్కారాలు చూసిన రాఘవరావు జీవితం కన్నీళ్ల మయం ఎందుకైందని చెప్పే కథ.

రంగమార్తాండ రాఘవరావు భార్య, పిల్లలు, సన్నిహితుల భావోద్వేగాలతో ముడివేసుకున్న చిత్రమని అర్థం అవుతుంది. తిరుగులేని కీర్తి అనుభవించిన ఆయన అందరికీ ఎందుకు బరువు, భారమయ్యారనేది ప్రధాన సంఘర్షణ. ట్రైలర్ మొత్తం ఎమోషనల్ సన్నివేశాలతో నిండి ఉంది. బ్రహ్మానందం పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంది. ఆయన గతంలో ఎన్నడూ చూపించని షేడ్ రంగమార్తాండ మూవీలో చూడొచ్చని చెప్పవచ్చు.

మొత్తంగా రంగమార్తాండ ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర కీలక రోల్స్ లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. మార్చి 22న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ రంగమార్తాండ ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా చూసిన ప్రముఖులు పాజిటివ్ గా స్పందించారు. రంగమార్తాండ పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.