Rangamarthanda : మంచి సినిమాని సరైన పద్దతి లో జనాల్లోకి తీసుకెళ్లలేకపోవడం అనేది కచ్చితంగా దర్శకుడి వైఫల్యానికి ప్రతీక అనే చెప్పాలి. ఈ విషయం లో రీసెంట్ ఉదాహరణగా ‘రంగ మార్తాండ’ అనే చిత్రాన్ని తీసుకోవచ్చు.కృష్ణ వంశీ లాంటి లెజండరీ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకుడు.ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ మరియు బ్రహ్మానందం లాంటి నటీనటులు ఉన్నారు.టాక్ మరియు రివ్యూస్ అన్నీ బాగున్నాయి, కానీ ఏమి లాభం ఈ చిత్రానికి సరిగా ప్రొమోషన్స్ చేసుకోలేకపోయారు.ప్రొమోషన్స్ పూర్తిగా చెయ్యలేదు అని చెప్పలేము కానీ, వీళ్ళు చేసిన ప్రొమోషన్స్ సినిమాకి టికెట్స్ తెంపడం లో ఏమాత్రం ఉపయోగపడలేదు.
అలాంటి నాసిరకపు కంటెంట్ తో ప్రొమోషన్స్ చేసారు, అందుకే జనాలు ఆసక్తి చూపలేదు.అయితే మొత్తానికే రిజెక్ట్ చెయ్యకుండా, యావరేజ్ రేంజ్ వసూళ్లను ఇచ్చారు ఆడియన్స్.దాదాపుగా అన్నీ చోట్ల కలెక్షన్స్ రావడం ఆగిపోవడం తో , ఈ చిత్రం క్లోసింగ్ కలెక్షన్స్ ని వేసేస్తున్నారు ట్రేడ్ పండితులు.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల 60 లక్షల రూపాయలకు వరకు జరిగిందట.మొదటి రోజు 50 లక్షలను రాబట్టిన ఈ సినిమాకి ఇప్పటి వరకు కోటి 60 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి.బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ అవ్వాలంటే మరో కోటి రూపాయిల షేర్ ని రాబట్టాలి.ఇది ఇప్పుడు దాదాపుగా అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
గత వీకెండ్ పై ఈ మూవీ టీం భారీ ఆశలు పెట్టుకుందని, కానీ రామ్ చరణ్ ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్ వసూళ్ల ప్రభావం ఈ చిత్రం మీద కూడా బలంగా పడిందని, అందుకే వసూళ్లు ఆగిపోయాయని అంటున్నారు.అలా మంచి సినిమాగా రివ్యూస్ దక్కించుకున్న ‘రంగ మార్తాండ’ టైం కలిసిరాక బాక్స్ ఆఫీస్ వద్ద చివరికి యావరేజి గా నిల్చింది.