https://oktelugu.com/

Rangamarthanda collections : ట్రేడ్ కి అతి పెద్ద షాక్ ఇచ్చిన ‘రంగమార్తాండ’ 2వ రోజు వసూళ్లు..’ధమ్కీ’ ని దాటేసిందిగా!

‘Rangamarthanda’ 2nd day collections : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న రెండు కొత్త సినిమాలు విడుదలయ్యాయి.అందులో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఒకటి కాగా, మరొకటి కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’.కమర్షియల్ సినిమా అవ్వడం తో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రానికి మొదటి రోజు అదిరిపొయ్యే వసూళ్లే వచ్చాయి..కానీ రెండవ రోజు నుండి మాత్రం చాలా ప్రాంతాలలో ‘రంగమార్తాండ’ చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ ని పెద్ద […]

Written By: , Updated On : March 23, 2023 / 09:48 PM IST
Follow us on

‘Rangamarthanda’ 2nd day collections : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న రెండు కొత్త సినిమాలు విడుదలయ్యాయి.అందులో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఒకటి కాగా, మరొకటి కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’.కమర్షియల్ సినిమా అవ్వడం తో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రానికి మొదటి రోజు అదిరిపొయ్యే వసూళ్లే వచ్చాయి..కానీ రెండవ రోజు నుండి మాత్రం చాలా ప్రాంతాలలో ‘రంగమార్తాండ’ చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ ని పెద్ద షాక్ కి గురి చేసింది.

మొదటి రోజు ఉదయం ఆటలు మరియు మధ్యాహ్నం ఆటలను చూసి సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయిందేమో అని అనుకున్నారు అందరూ.కానీ సాయంత్రం ఆటల నుండి మెల్లగా పుంజుకొని ఓవరాల్ గా మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ ని సాధించింది.ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.ఈ చిత్రం మొదటి రోజు 50 లక్షల రూపాయిల షేర్ ని సాధించిందని తెలుస్తుంది.

ఇక రెండవ రోజు చాలా ప్రాంతాలలో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకున్నాయట.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ‘రంగమార్తాండ’ చిత్రం విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ని భారీ మార్జిన్ తో డామినేట్ చెయ్యడం ప్రారంభించింది అట.ఇదే ఇప్పుడు అందరిని షాకింగ్ కి గురి చేస్తున్న విషయం.ఒక యూత్ ఫుల్ కమర్షియల్ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ తో ఎలాంటి హంగులు లేకుండా విడుదలై డామినేట్ చెయ్యడం గమనార్హం.దీనిని ఫామిలీ ఆడియన్స్ పవర్ అంటారు అని విశ్లేషకులు చెప్తున్నారు.

కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే ‘బలగం’ చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది, ఇప్పుడు ‘రంగమార్తాండ’ చిత్రం కూడా అంతే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే రెండు కోట్ల 50 లక్షల రూపాయిలను వసూలు చెయ్యాలి.రెండు రోజుల్లో కోటి రూపాయిలు రాబట్టిన ఈ సినిమా, వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ సాదిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.