Rana RRR Glimps: ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చాక ఏదైనా స్పందిద్దామంటే ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి వదిలిన ‘ఆర్ఆర్ఆర్ గ్లింప్స్’ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ టీజర్ లో ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగణ్, ఆలియా భట్ ఇలా అందరినీ ఓ రేంజ్ లో చూపించిన రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు తార్కాణంలా టీజర్ ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటూ విజువల్ వండర్ అని చెప్పుకుంటున్నారు. రాజమౌళి ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ లో అటు రాంచరణ్ ను, ఇటు ఎన్టీఆర్ ను ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడు. కానీ దాని మీద స్పందించిన రానా మాత్రం ఇద్దరినీ బ్యాలెన్స్ చేయలేక హాట్ కామెంట్స్ చేసి ఇప్పుడు నందమూరి, మెగా హీరోల మధ్య చిక్కుకున్నాడు. వివాదాస్పదమయ్యాడు.
రాజమౌళి విడుదల చేసిన గ్లింప్స్ వీడియోను షేర్ చేసిన రానా మూడు పదాలతో తనదైన స్లైల్లో కామెంట్ చేశాడు. ‘మెగా మాస్ మ్యాజిక్’ అంటూ మూడు పదాల్లో ప్రశంసించాడు. అయితే మెగా అంటే రాంచరణ్ అని మ్యాజిక్ అంటే రాజమౌళిని కొనియాడాడని.. ఎన్టీఆర్ గురించి మాత్రం ప్రస్తావించలేదని అతడి ఫ్యాన్స్ ఇప్పుడు రానాను ట్రోల్ చేస్తున్నారు. రానాతో వాగ్వాదానికి దిగుతున్నారు.
అయితే మాస అంటే ఎన్టీఆర్ అని నందమూరి అభిమానులు రచ్చ చేస్తున్నారు. మొత్తానికి రానా కామెంట్ ఇప్పుడు మెగా, నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టిందనే చెప్పాలి.
MEGA MASS MAGIC!!! It’s just the most outstanding thing you’ve seen in life yet!! 🔥🔥🔥🔥🔥 https://t.co/A9H5MWiXlf
— Rana Daggubati (@RanaDaggubati) November 1, 2021