Jabardasth : జబర్ధస్త్ అంటేనే ‘సుడిగాలి సుధీర్’, హైపర్ ఆదిల టీం పర్ ఫామెన్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రతి గురు, శుక్రవారాల్లో వచ్చే వీరి స్కిట్ చూడడానికి ఎగడుతుంటారు. ముఖ్యంగా గురువారం ‘సుడిగాలి సుధీర్’ టీం చసే సందడి అంతా ఇంతాకాదు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ముగ్గురూ చేసే కామెడీకి ఫిదా కానీ వారుండరు. ఈ ముగ్గురు టాలెంటెడ్ మిత్రులతో కూడిన ఈ టీం ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్నాళ్లుగా ఈ టీం పూర్తిస్థాయిలో కనిపించకపోవడమే ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తోంది.
జబర్ధస్త్ లో అందరికంటే ఎక్కువగా నవ్వించే టీం ఏదైనా ఉందంటే అది ‘సుడిగాలి సుధీర్’ టీంనే. మంచి కోఆర్డినేషన్ తో కలిగిన గెటప్ లు వేసుకొని ఈ ముగ్గురూ చేసే కామెడీని ప్రేక్షకులు ఆదరిస్తుంటారు.
రాంప్రసాద్ తనతోపాటు మూడు పాత్రలు ప్రధానంగా స్కిట్ రాస్తారు. ముగ్గురు మిత్రులు అలవోకగా స్కిట్ లో ఒదిగిపోయి కామెడీ పంచుతారు. అయితే కొద్దిరోజులుగా ఈ ముగ్గురు తెరపై కనిపించడం లేదు. ఈ షోలో పాల్గొనడం లేదు. ఎందుకంటే ఈ షోతో ముగ్గురూ మంచి ఫేమ్ రాబట్టారు. గెటప్ శ్రీను కమెడియన్ గా సినిమాల్లో బిజీ అయ్యాడు. సుడిగాలి సుధీర్ బుల్లితెర షోలు చేస్తూనే హీరోగా సినిమాలు చేస్తున్నారు. అలాగే రాంప్రసాద్ రైటర్ గా.. యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. చాలా కాలం నుండే వీరికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ జబర్ధస్త్ షో వీడలేదు.
ఈ మధ్యకాలంలో వస్తున్న స్కిట్ లలో ఒకరుంటే మరొకరు ఉండడం లేదు. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో అయితే సుడిగాలి సుధీర్ తోపాటు గెటప్ శ్రీను ఇద్దరూ మిస్ అయ్యారు. ఆటోరాంప్రసాద్ ఒక్కడే పాత కొత్త కమెడియన్స్ తో స్కిట్ చేశాడు. దీనికి సంబంధించిన ప్రొమో విడుదల కాగా.. తన మిత్రులు లేకుండా స్కిట్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉందో చెప్పుకొని రాంప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.
తాజాగా జడ్జిగా గెస్ట్ గా వచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే సుధీర్, శ్రీను లేకుండా చేయడం ఎలా ఉందని అడగ్గా.. ‘వాళ్లిద్దరూ ఉంటూ స్కిట్ చేయడం నాకు చాలా ఈజీ.. బావా అంటూ లాగించేస్తాం.. కానీ ఎప్పుడూ స్కిట్ నేను రాయడంతో పాటు అందరినీ ప్రిపేర్ చేయాల్సి వస్తోంది.’ అంటూ రాంప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ఎంత బిజీగా ఉన్న సుధీర్, గెటప్ శ్రీను లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వీరు లేకపోవడంతో ఈ షో చూడడానికే జనాలు తటపటాయిస్తున్నారు.