RGV- Bandi Sanjay Son: బండి సంజయ్ కుమారుడి వ్యవహారం రోజురోజుకు రచ్చ అవుతోంది. కళాశాలలో తోటి విద్యార్థిపై ఆయన కొడుకు బండి భగీరథ దాడి చేసిన ఘటన చర్చనీయాంశం అవుతోంది. రాజకీయాలను అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సంజయ్ కొడుకు ఓ నియంత అంటూ ట్వీట్లు చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడని విమర్శలు చేస్తున్నారు. పుత్రరత్నం చేసిన పనికి సంజయ్ ని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో ఇదే టాపిక్ హాట్ గా మారుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. బండి సంజయ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఎప్పుడు వివాదాల్లో ఉండే ఆర్జీవీ తనదైన శైలిలో సంజయ్ పై ట్వీట్ చేశారు. సంజయ్ ను సద్దాం హుస్సేన్ గా కొడుకును ఉదయ్ హుస్సేన్ అని పోల్చుతూ సంచలన ఆరోపణలు చేశారు. సంజయ్ ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇరాక్ ను వణికించిన సద్దాం హుస్సేన్ సంజయ్ రూపంలో బతికే ఉన్నాడని ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. తండ్రి కొడుకులను ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేకున్నా వర్మ ఇలాంటి వివాదాల్లో తల దూర్చడం కొత్తేమీ కాదు. గతంలో సైతం ఆయన తనదైన శైలిలో పలువురిపై విమర్శలు చేసిన దాఖలాలున్నాయి. ఇప్పుడు వర్మ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. నీ బతుకు అషురెడ్డి కాళ్ల దగ్గరే అని ప్రతిగా ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయాల గురించి నీవెందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొందరు భగీరథకు సంబంధించిన వీడియోలు ఇంకా పంపుతాం సినిమా తీయండని ఉచిత సలహా ఇస్తున్నారు.

అన్నింట్లో వేలు పెట్టడం నీకు కొత్తేమీ కాదు కానీ ఆలోచించి నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో తల దూర్చి వివాదాలు రాజేయడం నీకు అలవాటే కదా అని హితవు పలుకుతున్నారు. సంజయ్ ని తంబాకుగా కొడుకును తాగుబోతుగా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాలేజీలో భగీరథ దౌర్జన్య కాండకు ఇదే నిదర్శనమని చెబుతున్నారు. జల్సాకు అలవాటు పడి తోటి విద్యార్థులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నానా రకాలుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతున్నాయి.