RGV vs KA Paul : మునుగోడు ఎన్నికపై రాజకీయంగా చర్చలు సాగుతుంటే.. సోషల్ మీడియాలో కామెడీ కామెంట్లు పేలుతున్నాయి. ఈ ఎన్నిక తరువాత కొందరు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఇదే తరుణంలో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆయన ప్రధాన రాజకీయ పార్టీలను కాకుండా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కే.ఏ.పాల్ పై సెటైర్లు విసిరారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలపై కే.ఏ. పాల్ త్వరలో బాంబులు వేయనున్నారని సంచలన కామెంట్లు చేశారు. ఆర్జీవీ చేసిన ఈ కామెంట్లు రాజకీయంగా చర్చకు దారి తీశాయి.

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే.ఏ. పాల్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక సందర్భంగా ఆయన చేసిన ఫీట్లు అందరినీ అలరించాయి. పోలింగ్ కు ముందు తాను ఫస్ట్ ఫ్లేసులో ఉంటానని.. సెకండ్ ఎవరస్తారని.. అడిగిన వీడియో వైరల్ అయింది. తాను తప్పకుండా ఈ ఎన్నికలో విజయం సాధిస్తానని పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ క్రమంలో ఇతర పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తూనే తన దైన డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక పోలింగ్ రోజున ఆయన ప్రతీ కేంద్రానికి పరుగులు పెట్టిన వీడియో పాపులర్ అయింది. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా .. సినీ స్టార్ కమెడియన్ లా ప్రవర్తిస్తున్నాడని చాలా మంది ఈ వీడియోపై కామెంట్లు పెట్టారు.
Just heard that K A Paul is using his friends in ISIS and ALQAEDA to BOMB munugodu constituency ..Hey people please RUN 🏃♂️🏃♂️🏃♂️
— Ram Gopal Varma (@RGVzoomin) November 6, 2022
కానీ ఆ తరువాత కే.ఏ. పాల్ తుస్సుమనడంతో ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవి హాట్ కామెంట్స్ చేశారు. కే.ఏ. పాల్ తనను ఓడించినందుకు త్వరలో మునుగోడు ప్రజలపై బాంబులు వేయనున్నారని అన్నారు. జీసెస్ పవర్ తో తన శక్తిని ఉపయోగించి మునుగోడులో పంటలు పండకుండా చేయడానికి కేఏ పాల్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పుడు మునుగోడు ప్రజలు తరిమేశారు.. ఇక అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఆర్జీవి అన్నారు.
Also heard that K A PAUL is using his power with JESUS to see that NO crops will grow in Munugodu and all its people will be infected with a deadly VIRUS
— Ram Gopal Varma (@RGVzoomin) November 6, 2022
కే.ఏ. పాల్ పై ఆర్జీవి గతంలోనూ కామెంట్లు చేశారు. తాజాగా ఆయన మరోసారి విరుచుకుపవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొందరు ఆర్జీవి కే.ఏ.పాల్ ను మించిన ఫీట్లు చేస్తున్నారని రిప్లై ఇస్తున్నారు. ఇక మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి కొనసాగారు. ఆయన బీజేపీలో చేరిన తరువాత ఈ ఉప ఎన్నికను నిర్వహించారు.