Vijay Devarakonda : పుట్టుకతో వచ్చింది పుల్లలతో కానీ పోదంటారు. యాటిట్యూడ్ విజయ్ దేవరకొండ నరనరాల్లో జీర్ణించుకుపోయినట్లుంది. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తీరు మారడం లేదు. తాజాగా షూష్ చూపిస్తూ ఫోటో షూట్ చేయగా ఆయన ఫోజు అభ్యంతరకరంగా ఉంది. అర్జున్ రెడ్డి చిత్రానికి ముందు విజయ్ దేవరకొండకు ఫేమ్ లేదు. ఆయనలో ఇప్పుడున్న యాటిట్యూడ్ లేదు. అర్జున్ రెడ్డి మూవీలో పాత్ర స్వభావం చాలా పొగరుగా ఉంటుంది. ఎవరినీ లెక్క చేయని తత్త్వం, నేను అనుకుంటే జరిగిపోవాలనే మొండితనం ఆ క్యారెక్టర్ లో కలిగి ఉంటుంది. అర్జున్ రెడ్డి చిత్ర ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ఆ పాత్రను తన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ లో చూపించాడు.

అది కాస్తా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ తన సిగ్నేచర్, ఐడెంటిటీ అన్న అభిప్రాయానికి వచ్చాడు. అప్పటి నుండి ఏమాత్రం తగ్గకుండా మైంటైన్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఈ తరహా బిహేవియర్ నచ్చని వాళ్ళు, వ్యతిరేకించే వర్గం తయారైంది. అతనిపై నెగిటివిటీ పెరిగిపోయింది. అదే సమయంలో ఈ నేచర్ అతనికి ఫ్యాన్ బేస్ కూడా తెచ్చిపెట్టింది.
అయితే రాను రాను విజయ్ దేవరకొండ డోంట్ కేర్ యాటిట్యూడ్ ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. డియర్ కామ్రేడ్ మూవీలో విషయం ఉంది. కానీ విజయ్ దేవరకొండ బిహేవియర్ నచ్చక పూర్తి నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. వరల్డ్ ఫేమస్ లవర్ పరిస్థితి కూడా అదే. ఈ చిత్రాలు ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. గీత గోవిందం సక్సెస్ తో విజయ్ దేవరకొండ టైర్ టూ హీరోలలో టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. స్టార్ హీరోల రేంజ్ ట్రీట్మెంట్ దక్కించుకుంటున్నాడు.
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. విజయ్ దేవరకొండ మాత్రం తన యాటిట్యూడ్ మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఇక లైగర్ రిజల్ట్ తర్వాతైనా మారతాడు అనుకుంటే ఆ ఛాయలు కనిపించడం లేదు. లైగర్ దారుణ ఫలితానికి విజయ్ మాటతీరు కారణమైందని ముంబై థియేటర్ ఓనర్ ఒకరు నేరుగానే విమర్శలు చేశారు. అయినా నేనింతే అంటున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా షూస్ చూపిస్తూ ఫోటో షూట్ చేశాడు. సదరు ఫోటో షూట్ లో విజయ్ దేవరకొండ ఫోజు అభ్యంతరకరంగా ఉంది. విజయ్ దేవరకొండ ఫోజుపై నెటిజన్లు మండిపడుతున్నారు.