https://oktelugu.com/

#RRR Japan : జపాన్ లో #RRR మూవీ ప్రొమోషన్స్ కి పాల్గొన్న రామ్ చరణ్ – ఎన్టీఆర్

#RRR Japan : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది విడుదలై ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే.. విడుదలైన ప్రతి భాషలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని సృష్టించింది ఈ సినిమా..రాజమౌళి తో పాటుగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ కి ఈ సినిమా తెచ్చిపెట్టిన పేరు కేవలం పాన్ ఇండియా లెవెల్ లో లేదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంది..నెట్ ఫ్లిక్స్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2022 / 09:06 PM IST
    Follow us on

    #RRR Japan : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది విడుదలై ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే.. విడుదలైన ప్రతి భాషలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని సృష్టించింది ఈ సినిమా..రాజమౌళి తో పాటుగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ కి ఈ సినిమా తెచ్చిపెట్టిన పేరు కేవలం పాన్ ఇండియా లెవెల్ లో లేదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంది..నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాకి లభించిన ఆదరణ అంతా ఇంత కాదు.

    దేశాలు దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా గుర్తింపుని తెచ్చుకుంది..ముఖ్యంగా పశ్చిమ దేశానికీ చెందిన వారు ఈ సినిమాని ఎగబడి చూసారు..#RRR టీంని పొగడ్తలతో ముంచెత్తారు. అంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమాని ఇప్పుడు జపాన్ లో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు..జపాన్ లో మన తెలుగు సినిమాలు గత కొన్నేళ్ల నుండి ఏ రేంజ్ లో అలరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    బాహుబలి సిరీస్ తో పాటుగా రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా కూడా ఇక్కడ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టింది..అంతే కాకుండా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు ఈ దేశం లో మాములు క్రేజ్ లేదు..అందుకే ఈ చిత్రాన్ని గ్రాండ్ ప్రొమోషన్స్ తో విడుదల చెయ్యడానికి మూవీ టీం మొత్తం జపాన్ కి ప్రయాణం అయ్యింది..ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో రాజమౌళి కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు.. ఇప్పటికే రామ్ చరణ్ మరియు ఉపాసన జపాన్ కి చేరుకోగా..జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సాయంత్రం పయనమయ్యారు.

    ఈనెల 21 వ తేదీన ఈ చిత్రం జపాన్ మొత్తం మీద భారీ లెవెల్ లో విడుదల కానుంది..చూడాలి మరి ఈ సినిమా జపాన్ లో ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోంది అనేది..అంతే కాకుండా ఈ సినిమా ఈ ఏడాది లోనే చైనా లో కూడా విడుదల చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తుంది.