
Ram Charan Game Changer Story: ఇండియన్ సినిమాకు భారీతనం పరిచయం చేసిన దర్శకుల్లో శంకర్ ఒకరు. సోషల్ ఇష్యూస్ ఎంచుకుని కమర్షియల్ సబ్జెక్స్ గా తెరకెక్కించడంలో దిట్ట. దాదాపు ఆయన చేసిన సినిమాలన్నీ సోషల్ సబ్జక్ట్స్ తో కూడుకున్నవే. ఒకప్పుడు శంకర్ తో మూవీ చేసే ఛాన్స్ కోసం హీరోలు ఎదురుచూసేవారు. కాగా ఆయన తమిళ హీరోలతో మాత్రమే చిత్రాలు చేసేవారు. మొదటిసారి శంకర్ అవుట్ సైడ్ కోలీవుడ్ హీరోతో మూవీ చేస్తున్నారు. ఓ పక్కా పొలిటికల్ ఎంటర్టైనర్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీకి మొదట పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట శంకర్. నిర్మాత దిల్ రాజుతో ఇదే విషయం చెప్పారట. దిల్ రాజు మాత్రం రామ్ చరణ్ ని సూచించారట. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ ఖాతాలో చేరింది. టైటిల్ కాన్సెప్ట్ టీజర్ లో శంకర్ కథపై కొన్ని హింట్స్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికలు మూవీలో ప్రధాన అంశంగా తెలుస్తుంది. ఈ మూవీ కథపై ఓ వాదన ప్రచారం అవుతుండగా… దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ తో పూర్తి అవగాహన వచ్చింది.
దిల్ రాజు రీసెంట్ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సాధారణంగా శంకర్ సినిమాలంటే… భారీ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తో కూడిన విజువల్స్ ఉంటాయి. గేమ్ ఛేంజర్ మూవీలో అలాంటివి ఆశించవచ్చా అని అడగ్గా… ఇది ఆ తరహా మూవీ కాదు. సోషల్ మెసేజ్ తో కూడిన రివేంజ్ డ్రామా. దర్శకుడు శంకర్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని అన్నారు.

దిల్ రాజు కామెంట్స్ గతంలో గేమ్ ఛేంజర్ కథపై ప్రచారమైన కథనాలకు దగ్గరగా ఉంది. దీంతో కథ ఇదే అంటూ టాలీవుడ్ వర్గాలు ఒక అవగాహనకు వచ్చాయి. దాని ప్రకారం… రామ్ చరణ్ ఒక పొలిటికల్ లీడర్. ప్రజాభిమానం ఉన్నప్పటికీ ఎన్నికల్లో జరిగిన అవినీతి, అవకతవకల కారణంగా ఓడిపోతాడు. విలన్స్ ఆయన కుటుంబాన్ని నాశనం చేస్తారు. తండ్రికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకునేందుకు కొడుకు రంగంలోకి దిగుతాడు. ఎన్నికల అధికారిగా మారి ప్రత్యర్థులను అణచివేసే ప్రణాళిక మొదలుపెడతాడు. ఆ విధంగా తండ్రి ఓటమికి కారణమైన వాళ్ళ మీద రివేంజ్ తీర్చుకుంటాడు.
మొత్తంగా ఇదే గేమ్ ఛేంజర్ మూవీ కథ అంటున్నారు. మరి చూడాలి ఈ వాదనలో ఎంత నిజముందో. దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ చిత్రం. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.