
Ram Charan Hollywood Movie: మరో రెండు రోజుల్లో #RRR మూవీ కి ఆస్కార్ అవార్డు దక్కుతుందో లేదో తెలిసిపోబోతుంది.ప్రపంచం నలుమూలల ఉన్న ఇండియన్స్ అందరూ ఈ అవార్డు #RRR మూవీ కి దక్కాలని కోరుకుంటున్నారు,ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి దక్కుతున్న పాన్ వరల్డ్ ఇమేజి, విమసకులను సైతం ముక్కు మీద వేలు వేసుకునేలా చేస్తోంది.రోజు రోజుకి ఆయన పాన్ వరల్డ్ ఇమేజి పెరుగుతూ పోతుంది.
HCA అవార్డ్స్ దగ్గర నుండి లైం లైట్ లోకి వచ్చిన రామ్ చరణ్ ని, హాలీవుడ్ మీడియా మొత్తం #RRR చిత్రానికి ఫేస్ గా పరిగణిస్తుంది.ఆస్కార్ అవార్డ్స్ ప్రొమోషన్స్ కోసం అన్ని హాలీవుడ్ మీడియా సంస్థలు రామ్ చరణ్ చుట్టూనే తిరుగుతున్నాయి.దీనిని బట్టి ఆయన క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.పచ్చ మీడియా రామ్ చరణ్ ని ఎంత తొక్కాలని ప్రయత్నం చేసిన, నిజమైన రీచ్ తో డామినేట్ చేస్తూ తనని తొక్కాలని చూసిన ప్రతీ ఒక్కరికి చెంప దెబ్బ కొట్టాడు.
ఇప్పటికే రామ్ చరణ్ ని జేమ్స్ కెమరూన్ మరియు స్పీల్ బర్గ్ వంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ప్రసంగాలతో ముంచెత్తారు.ఇప్పుడు స్టార్ వార్స్ వంటి సంచలనాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన JJ అబ్రామ్స్ రామ్ చరణ్ ని తన నివాసం కి ఆహ్వానించి ఆయతో సుదీర్ఘ చర్చలు జరపడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.వీళ్లిద్దరి చర్చలకు కారణం త్వరలోనే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా కోసమే అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

రామ్ చరణ్ కూడా ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ తో చర్చలు జరిగాయని, త్వరలోనే అభిమానులకు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.ఈ నెల 27 వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియజెయ్యనున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తైన తర్వాత ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వస్తుందని తెలుస్తుంది.