
Ram Charan – Varun Tej : అన్నయ్య రామ్ చరణ్ మీద వరుణ్ తేజ్ ఆరోపణలు చేశారు. నన్ను కొడుతూ, ఏడిపిస్తున్నాడని అసహనం వ్యక్తం చేశాడు. దాంతో పెదనాన్న చిరంజీవికి చరణ్ మీద కంప్లైంట్ చేశానని వరుణ్ వెల్లడించారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదులెండి. చిన్నప్పుడు చరణ్ తమ్ముడు వరుణ్ ని ఏడిపించేవాడట. అల్లరిలో భాగంగా అలా చేసేవాడట. దాంతో వరుణ్ వెళ్లి చిరంజీవి వెనుక దాక్కునేవాడట. చరణ్ మీద పెదనాన్నకు కంప్లైంట్ చేసేవాడట. ఈ విషయాన్ని వరుణ్ గత ఏడాది ఓ సందర్భంలో వెల్లడించారు. వరుణ్ ఒకప్పటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చిన్నప్పుడు చరణ్ చాలా అల్లరివాడు నన్ను కొట్టేవాడని చెప్పిన వరుణ్ తేజ్… చిరుత మూవీలో నటించాక తనలో ఎక్కడలేని మెచ్యూరిటీ వచ్చిందన్నారు. చిరంజీవిలో మంచితనం పవన్ కళ్యాణ్ లోని ముక్కుసూటితనం కలగలిపితే చరణ్ అని వరుణ్ అన్నారు. అంత గొప్ప హ్యూమన్ బీయింగ్ ని నేను చూడలేదు. నా అన్నయ్యని కాదు కానీ చరణ్ గ్రేట్ పర్సనాలిటీ అని వరుణ్ కొనియాడారు. చరణ్ జోలికి ఎవరైనా వస్తే మీతో పాటు నేను కూడా ముందు ఉంటాను… అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి వరుణ్ మాట్లాడారు.
వరుణ్ కామెంట్ అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని గుర్తు చేస్తున్నాయి. రామ్ చరణ్ 2007లో చిరుత మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. చరణ్ కంటే వయసులో చాలా చిన్నవాడైన వరుణ్ ఏడేళ్లకు 2014లో ముకుంద మూవీతో హీరో అయ్యాడు. చరణ్ గ్లోబల్ స్టార్ ఎదిగారు. వరుణ్ తనకంటూ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు.
మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాత్రి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీకి టాలీవుడ్ పెద్దలు మొత్తం హాజరయ్యారు. రాజమౌళి, వెంకటేష్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, నిఖిల్, అడవి శేష్, విజయ్ దేవరకొండ, ప్రశాంత్ నీల్ తో పాటు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని అభినందించడం విశేషం. రాజమౌళి, డివివి దానయ్య, రమా రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి, కార్తికేయలను చిరంజీవి అభినందించారు.