
Ram Charan: #RRR మూవీ కి ఆస్కార్ అవార్డు రావడం పట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత సంతోషం గా ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.’నాటు నాటు’ పాట కి ప్రపంచవ్యాప్తంగా ఆ రేంజ్ రీచ్ రావడానికి ప్రధాన కారణాలలో రామ్ చరణ్ డ్యాన్స్ అత్యంత కీలకం, అందుకే పేరుకి కీరవాణి మరియు చంద్ర బోస్ ఆస్కార్ అవార్డ్స్ తీసుకున్న, క్రేజ్ మాత్రం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి మాత్రమే వచ్చింది.ఆస్కార్ హుంగామ మొత్తాన్ని ముగించుకొని రామ్ చరణ్ మొన్ననే ఇండియా కి తిరిగి వచ్చాడు.
ఆయనని అభిమానులు బేగం పేట విమానాశ్రయం లో ఎంత ఘనంగా రిసీవ్ చేసుకున్నారో అందరం చూసాము.అభిమానుల ఆనందం కి అయితే హద్దులే లేకుండా పోయింది.ఎందుకంటే #RRR చిత్రం పట్ల అందరికంటే ఎక్కువ క్రేజ్ మరియు ఫాలోయింగ్ తెచ్చుకుంది రామ్ చరణ్ మాత్రమే.నేషనల్ మీడియా లో కానీ, ఇంటర్నేషనల్ మీడియా లో కానీ రామ్ చరణ్ పేరు మాత్రమే మారుమోగిపోయింది.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ పుట్టబోయ్యే తన బిడ్డ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.ఆయన మాట్లాడుతూ ‘నేను మరియు నా భార్య ఉపనన ఎంతో అదృష్టవంతులం, నా బిడ్డ ఆమె కడుపులు పడగానే ఇన్ని మంచి జరిగింది.కడుపులో ఉన్నప్పుడే ఇన్ని అద్భుతాలు చేస్తే, బయటకి వచ్చిన తర్వాత ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో’ అంటూ రామ్ చరణ్ ఆనందం తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ కి పాపం ఊపిరి అదెంత సమయం కూడా దొరకడం లేదు.నిన్న మొన్నటి వరకు USA ఆస్కార్ టూర్ లో ఫుల్ బిజీ గా ఉన్న రామ్ చరణ్ , ఇప్పుడు వెంటనే శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు.ఈ నెల 27 వ తారీఖున ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.