
Ram Charan: అమెరికాలో రామ్ చరణ్ సందడి చేస్తున్నారు. లోకల్ మీడియా ఇంటర్వ్యూల కోసం ఆయన వెంట పడుతుంది. హాలీవుడ్ స్టార్స్ రేంజ్ ట్రీట్మెంట్, ఫేమ్ ఆయనకు దక్కుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించారు. ప్రఖ్యాత సినిమా వేదికలపై ఆయన మెరుస్తున్నారు. రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అత్యంత అరుదైన గౌరవంగా నటులు దీన్ని భావిస్తారు. ఆ ఘనత అందుకున్న ఓన్లీ ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డులకు ఎక్కారు. అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. HCA అవార్డ్స్ వేడుకకు ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అలాగే స్పాట్ లైట్ అవార్డుతో గౌరవించారు.
అమెరికాలో జరుగుతున్న అవార్డు ఈవెంట్స్, మీడియా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇస్తున్నారు. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని లుక్, రాయల్టీ మైంటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ధరిస్తున్న బట్టలు అందరినీ ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ వేసుకున్న సూట్స్ గురించి చర్చ నడుస్తోంది. ఈ సూట్స్ ఎవరు రూపొందించారు? ధర ఎంత? అనే విషయాలు జనాలు సేకరిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం రామ్ చరణ్ ధరించి సూట్స్ ని చెన్నైకి చెందిన ఓ ప్రముఖ డిజైనర్ రూపొందించారు. ఇక వాటి ధర తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఒక్కో సూట్ ఖరీదు రూ. 13 లక్షల నుండి 70 లక్షల వరకు ఉంటుందట. దీంతో ఒక్క డ్రెస్ ఖరీదు అన్ని లక్షాలా అని సామాన్యులు నోరెళ్ళ బెడుతున్నారు. మరి చరణా మజాకానా. అంతర్జాతీయ వేదికల కోసం ఆ స్థాయిలో తయారవ్వాలి తప్పదు.

కాగా మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఆ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అతిరథ మహారధులు హాజరవుతారు. ఆ రోజు రామ్ చరణ్ ఎలాంటి బట్టలు ధరిస్తారో చూడాలి. ఆస్కార్ వేడుక కోసం చరణ్ టక్సెడో సూట్ లో సిద్ధమయ్యే సూచనలు కలవు. ఆర్ ఆర్ ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ పొందిన సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన నేపథ్యంలో ఆస్కార్ ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది.
All the latest looks of @AlwaysRamCharan are swoon worthy he is class apart pic.twitter.com/otEZpLfs0S
— Bhav (@Dr_bhavG) March 1, 2023