Homeఎంటర్టైన్మెంట్Ram Charan: బిరుదు మార్చుకున్న రామ్ చరణ్.. అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు మెగా హీరో..

Ram Charan: బిరుదు మార్చుకున్న రామ్ చరణ్.. అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు మెగా హీరో..

Ram Charan
Ram Charan

Ram Charan: సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలున్నా నటనలో మాత్రం ఎవరి స్టైల్ వారిదే. వారి యాక్టింగ్ ను బేస్ చేసుకొని ఫ్యాన్స్ వారికి బిరుదు ఇస్తుంటారు. అలనాటి హీరోల నుంచి నేటి అల్లు అర్జున్ వరకు వారి ఇంటి పేర్లతో కాకుండా కొన్ని ప్రత్యేక పేర్లను చేర్చి పిలుస్తారు. అలా చిరంజీవి నటనను భట్టి ఒకప్పుడు సుప్రీం హీరో అన్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా వారి నటనా శైలిని భట్టి బిరుదులు మార్చుతున్నారు. లేటేస్టుగా మెగా హీరో రామ్ చరణ్ ను కొత్త పేరుతో పిలుస్తున్నారు. ఇటీవల ఆయన స్థాయి అంతర్జాతీయ లెవల్లో వెళ్లింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న మెగా పవర్ స్టార్ బిరుదు కాస్త గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. ఇలా హీరోలకు ఎలాంటి బిరుదులు ఉన్నాయో.. ఆ తరువాత ఎలా మారాయో చూద్దాం.

చిరంజీవి:
ఇండస్ట్రీలో స్వయం శక్తితో ఎదిగిన హీరో ఎవరంటే చిరంజీవి గురించే చెబుతారు. ఆయన సినీ కెరీర్లో ఎన్నో సక్సెస్ సినిమాలు ఉన్నాయి. ఎ కోదండారాంరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ‘మరణ మృదంగం’ సినిమా నుంచి చిరంజీవికి ‘సుప్రీం’ బిరుదు వచ్చింది. ఆ తరువాత హిట్లర్ సినిమా నుంచి ‘మెగాస్టార్’ గా మార్చారు. ఇప్పటీకీ ఆయనను మెగాస్టార్ హీరోగానే కీర్తిస్తున్నారు.

Ram Charan
Chiranjeevi

బాలకృష్ణ:
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలకృష్ణకు.. తండ్రి ఎన్టీఆర్ కు ఉన్న నటరత్న బిరుదు నుంచి యువరత్నగా ఇచ్చారు. ఇక ఈ శతాబ్దంలో వచ్చిన సింహా సినిమాతో ‘నట సింహా’ అని పిలుస్తున్నారు.

Ram Charan
Balakrishna

కృష్ణ:
కృష్ణ ను అందరూ మొదట్లో నటశేఖర కృష్ణ అని పిలిచే వారు. కానీ ఓ న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఎవరు? అని పోల్ పెడితే కృష్ణకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ అని పిలుస్తున్నారు.

నాగార్జున:
అక్కినేని నాగేశ్వర్ రావుకు నట సామ్రాట్ అనే బిరుదు ఉండేది. దీని నుంచి ఆయన కుమారుడు నాగార్జునకు యువ సామ్రాట్ అని పెట్టారు. కింగ్ సినిమా సక్సెస్ అయిన తరువాత ‘కింగ్ నాగార్జున’ అని పిలుస్తున్నారు.

Ram Charan
Nagarjuna

మహేష్ బాబు:
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారతసత్వం పుచ్చుకున్న మహేష్ బాబు ను మొదట్లో ప్రిన్స్ అని పిలిచేవారు. పూరిజగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరీ మూవీ నుంచి ఆయనను ‘సూపర్ స్టార్’ అని పిలుస్తున్నారు.

రవితేజ:
మాస్ యాక్షన్ తో మెప్పించే రవితేజను మాస్ హీరో అని పిలిచేవారు. ఆ తరువాత ఆయనను మాస్ మహరాజ అని పిలస్తున్నారు.

రామ్ చరణ్:
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన రామ్ చరణ్ ను.. తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ నుంచి తీసుకొని మెగా పవర్ స్టార్ అని పిలిచేవారు. కానీ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. దీంతో ఆయనను గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు.

ప్రభాస్:
రెబల్ స్టార్ కృష్ణం రాజు నుంచి ప్రభాస్ కు యంగ్ రెబల్ స్టార్ అని పిలిచారు. ఆయన ఏజ్ పెరగడంతో ఇప్పుడు ఆయనను రెబల్ స్టార్ అని పిలుస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version