Ram Charan Politics: ఆర్ ఆర్ ఆర్ మూవీ విజయంతో ఊపుమీదున్నాడు రామ్ చరణ్. వరల్డ్ వైడ్ సత్తా చాటిన ఈ మూవీ అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి రెండు విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ నామినేట్ అయ్యింది. ఇక ఆస్కార్ బరిలో సైతం నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ అయ్యింది. రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ ఏదో ఒక విభాగంలో ఆస్కార్ సాదిస్తుందని ఇండియన్ మూవీ లవర్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగింది. వరల్డ్ వైడ్ వారికి అభిమానులు ఏర్పడ్డారు.

ఆర్ ఆర్ ఆర్ షూట్ పూర్తి కాగానే రామ్ చరణ్ శంకర్ మూవీ స్టార్ట్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా దర్శకుడు శంకర్ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఇది 50వ చిత్రం. ఈ మూవీలోని రామ్ చరణ్ స్టిల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శంకర్ హీరో రామ్ చరణ్ ని రెండు భిన్నమైన పాత్రల్లో చూపించనున్నారు. పిరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ ఈ చిత్రానికి ఉంది. లీకైన ఫొటోలతో ఇది రుజువైంది.
పీరియడ్ రోల్ లో రామ్ చరణ్ పొలిటీషియన్ గా కనిపిస్తారని సమాచారం. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. పంచ కట్టు, మెడలో కండువాతో ఉన్న రామ్ చరణ్ రాజకీయ వేదికపై ఒక వ్యక్తిని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఆ సభలో రామ్ చరణ్ కట్ అవుట్స్ ఉన్నాయి. సామాజికంగా ఉన్నత భావాలు కలిగిన నిఖార్సయిన పొలిటికల్ లీడర్ గా రామ్ చరణ్ కనిపిస్తారని విశ్వసనీయ సమాచారం.
పీరియాడిక్ పాత్రకు హీరోయిన్ గా తెలుగు అమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆర్సీ 15 కి లీకుల బెడద ఎక్కువైపోయింది. ఇప్పటికే రామ్ చరణ్ కి సంబంధించిన అనేక స్టిల్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో మోడరన్ రోల్ చేస్తున్నారట. ఈ రెండు పాత్రలను లింక్ చేస్తూ శంకర్ ఒక సోషల్ ప్రాబ్లం ని బలంగా చర్చించనున్నారట. రామ్ చరణ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సింది. మధ్యలో శంకర్ కి భారతీయుడు 2 షూట్ బాధ్యతలు వచ్చిపడ్డాయి. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 షూట్ తిరిగి ప్రారంభమైంది. ఏక కాలంలో ఆర్సీ 15, భారతీయుడు 2 చిత్రాలను శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయంలో దిల్ రాజు, రామ్ చరణ్ శంకర్ పట్ల అసహనంగా ఉన్నారని సమాచారం. ఈ చిత్రంలో కియారా అద్వానీ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు శంకర్ సాంగ్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారట. శంకర్ సినిమాల్లో పాటలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ విషయంలో ఆయన మాస్టర్. ఈ క్రమంలో చరణ్-కియారాపై తెరకెక్కే సాంగ్స్ పై అంచనాలు ఏర్పడ్డాయి.