Nasal Vaccine Covid: కరోనా కట్టడికి ‘నాసల్’ టీకా.. మరో వ్యాక్సిన్ కు కేంద్రం ఆమోదం

Nasal Vaccine Covid: కోవిడ్ చైనాపై విరుచుకుపడుతోంది.. అధికారిక లెక్కలు బయటకు చెప్పడం లేదు కానీ అక్కడ రోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. వందలాది మరణాలు చోటుచేసుకుంటున్నాయి.. ప్రధాన నగరాల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీనికి “బిఎఫ్ 7” అనే వేరియంట్ గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.. ఇది పెద్దగా ప్రమాదకరం కాదని చెబుతున్నప్పటికీ… ప్రజల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.. పైగా చైనాలో నమోదవుతున్న మరణాలు […]

Written By: K.R, Updated On : December 24, 2022 12:11 pm
Follow us on

Nasal Vaccine Covid: కోవిడ్ చైనాపై విరుచుకుపడుతోంది.. అధికారిక లెక్కలు బయటకు చెప్పడం లేదు కానీ అక్కడ రోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. వందలాది మరణాలు చోటుచేసుకుంటున్నాయి.. ప్రధాన నగరాల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీనికి “బిఎఫ్ 7” అనే వేరియంట్ గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.. ఇది పెద్దగా ప్రమాదకరం కాదని చెబుతున్నప్పటికీ… ప్రజల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.. పైగా చైనాలో నమోదవుతున్న మరణాలు చూస్తుంటే ఇతర ప్రాంతాల ప్రజల్లోనూ వణుకు మొదలవుతున్నది.

Nasal Vaccine Covid

ముక్కు టీకా ద్వారా ముకుతాడు

అయితే బిఎఫ్ 7 కేసులు మన దగ్గర కూడా అక్కడక్కడా నమోదు అవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.. కోవిడ్ పరీక్షలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.. అంతేకాదు వ్యాక్సిన్ కేంద్రాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే గతంలో భారత్ బయోటెక్, సీరం సంస్థ లు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ లను దేశం మొత్తం వేశారు.. అది కూడా రెండు దశల్లో.. ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ కూడా వేశారు.. దీనివల్ల ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ పెరిగింది.. ఫలితంగా కోవిడ్ వ్యాప్తి తగ్గిపోయింది.. అయితే ఇప్పుడు చైనాలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం పనికిరాదని కేంద్రం భావిస్తోంది.. ఇందులో భాగంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ ముక్కు టీకా లేదా “ఇన్ కొవాక్” అనే వ్యాక్సిన్ ను 18 సంవత్సరాలు ఆ పైబడిన వారికి బూస్టర్ డోస్ గా వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.. అంతేకాదు దీనిని కొవిన్ వెబ్ సైట్ లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి దీనిని ప్రైవేట్ ఆస్పత్రిలో వేస్తారు.. 18 సంవత్సరాలు, ఆ పైబడి కోవీ షీల్డ్ లేదా కోవా గ్జీన్ లో ఒకదానిని రెండు డోసులు తీసుకున్న వారికి ముందస్తు డోసుగా ఈ వ్యాక్సిన్ అందిస్తారు.

కేసులు పెరిగిన నేపథ్యంలో..

చైనా తదితర దేశాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ముక్కు ద్వారా అందించే ఈ టీకా “బీబీవీ 154 “ను బూస్టర్ డోసుగా వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.. 18 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ వ్యాక్సిన్ ను బూస్టర్ డోస్ గా పరిమితంగా వాడేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నవంబర్లో అనుమతి ఇచ్చింది. ముక్కు ద్వారా చుక్కల మందు రూపంలో సులభంగా ఇచ్చే ఈ టీకా శ్వాస నాళం ద్వారా ప్రవేశించే వైరస్ లతో సమర్థవంతంగా పోరాడుతుందని కేంద్ర అధికారుల బృందం అభిప్రాయపడుతోంది.

Nasal Vaccine Covid

ఈ వ్యాక్సిన్ వల్ల ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ పెరుగుతుందని భారత్ బయోటెక్ వర్గాలు చెబుతున్నాయి.. దీనివల్ల వారు కోవిడ్ బారిన పడకుండా ఉంటారని పేర్కొంటున్నాయి. ఇటువంటి హైబ్రిడ్ ఇమ్యూనిటీ లేకపోవడం వల్లే చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఈ సందర్భంగా భారత్ బయోటెక్ కంపెనీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి..

Tags