https://oktelugu.com/

RRR Release: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై చరణ్ కామెంట్స్ వైరల్ !

RRR Release: పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందనే సమయంలో పోస్ట్ ఫోన్ అయింది. కరోనా మూడో వేవ్ కారణంగా సినిమాని పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదు. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా నార్త్ ఇండియాలో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేశారు. మహారాష్ట్రలో సైతం కరోనా ఆంక్షలు […]

Written By:
  • Shiva
  • , Updated On : January 13, 2022 11:55 am
    Follow us on

    RRR Release: పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందనే సమయంలో పోస్ట్ ఫోన్ అయింది. కరోనా మూడో వేవ్ కారణంగా సినిమాని పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదు. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా నార్త్ ఇండియాలో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేశారు. మహారాష్ట్రలో సైతం కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అక్కడ నైట్ కర్ఫ్యూ అమలవుతుంది. మొత్తానికి నార్త్ ఇండియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందుకే సినిమాని పోస్ట్ ఫోన్ చేశారు. అయితే, తాజాగా ఈ వాయిదా వ్యవహారం గురించి రామ్ చరణ్ పెదవి విప్పారు.

    Ram Charan

    Ram Charan

    ఇంతకీ చరణ్ ఏమి మాట్లాడాడు అంటే.. చరణ్ మాటల్లోనే.. “మా భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్ ఈ సంక్రాంతికి రిలీజ్‌ కాకపోయినా మాకేం బాదగా లేదు. ఎందుకంటే అలాంటి సినిమా సరైన సమయంలోనే రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే.. ఆ సినిమా కోసం మేము మూడున్నర సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాం. అందుకే, ఆ సినిమా రిలీజ్ విషయంలో సరైన నిర్ణయమే తీసుకోవాలి. రిలీజ్ గురించి దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయిస్తారని చరణ్ పేర్కొన్నాడు.

    Also Read: ఎన్టీఆర్, ప్రభాస్‌ సపోర్ట్‌ చేసినంత మాత్రాన నీకు గొప్ప స్థాయి రాదు

    ‘రౌడీ బాయ్స్‌’ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు గెస్ట్‌ గా వచ్చిన చరణ్, ఆ ఈవెంట్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా పై ఇలా స్పంధించారు. ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ఫోన్ కావడం వల్ల అభిమానులు బాగా నిరాశ చెందారు. ప్రేక్షకులంతా వచ్చే వారం థియేటర్స్ లో ఓ విజువల్ వండర్ చూడాలని మెంటల్ గా ఫిక్స్ అయిన సమయంలో.. సినిమా వాయిదా పడటం బాగా నిరుత్సాహపరిచింది.

    నిజానికి గతంలో కూడా మూడు సార్లు ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడింది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో రానున్న ఈ సినిమాతో ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వటానికి రాజమౌళి చాలా బాగా కసరత్తులు చేశాడు. పైగా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    Also Read: ఆ బిరుదు కోసం బన్నీ చాలా మారాడు !

    Tags