Ram Charan: గత ఏడాది విడుదలైన #RRR సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఇందులో పని చేసిన హీరోలకు మరియు డైరెక్టర్ రాజమౌళి కి అదే రేంజ్ లో పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి..అయితే ఈ చిత్రం ఏ ముహూర్తం లో ఓటీటీ లోకి అడుగుపెట్టిందో కానీ, అప్పటి నుండి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు లభించింది.

హాలీవుడ్ కి సంబంధించిన టెక్నిషియన్స్ , క్రిటిక్స్ మరియు హాలీవుడ్ నటులు కూడా ఈ చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపించారు..ఇక రీసెంట్ గానే ఈ సినిమా జపాన్ లో విడుదలై గత 80 రోజుల నుండి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూనే ఉంది..అలా అంతర్జాతీయ అవార్డ్స్ కి కూడా ఎంపిక అయ్యింది ఈ చిత్రం..హీరోలిద్దరికి కూడా పాన్ వరల్డ్ స్టార్స్ గా సరిసమానమైన ఇమేజి దక్కింది..కానీ రామ్ చరణ్ కి కాస్త ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఈ హీరో కి ఇప్పుడు హాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి..విశ్వసనీయ సమాచారం ప్రకారం రామ్ చరణ్ త్వరలోనే మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది..నిన్న హాలీవుడ్ మీడియా తో ఇంటరాక్ట్ అయ్యినప్పుడు హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్న కి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘#RRR తర్వాత హాలీవుడ్ నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి..కానీ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను..కచ్చితంగా చేసే పరిస్థితులు వస్తే ఛాన్స్ వదులుకోను’ అంటూ సమాధానం ఇచ్చాడు.

‘మార్వెల్ మూవీస్ లో సూపర్ హీరో పాత్ర పోషించే అవకాశం వస్తే మీరు ఏ రోల్ సెలెక్ట్ చేసుకుంటారు’ అని మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ‘నేను ఐరన్ మ్యాన్ పాత్ర చేస్తాను’ అంటూ బదులిచ్చాడు రామ్ చరణ్..ఆయనకీ మర్వెల్ స్టూడియోస్ తో ఒక పాత్రకోసం ఒప్పందం అయ్యిందని ఎప్పటి నుండో సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి..ఆ ఒప్పందం గురించే రామ్ చరణ్ పరోక్షంగా అభిమానులకు హింట్ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది.