https://oktelugu.com/

Rakul Preet Singh : మంచుతో నిండిన చల్లటి సరస్సులో స్విమ్మింగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. వైరల్ అవుతున్న వీడియో

రకుల్ ప్రీత్ సింగ్ తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తోంది. హాట్ వీడియోలను నెటిజన్లకు పంచుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2023 / 10:33 PM IST

    Rakul Preeth singh

    Follow us on

    Rakul Preet Singh : పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్ ఇమేజి ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్.’కెరటం’ అనే చిత్రం తో కెరీర్ ని ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తొలి సూపర్ హిట్ ని అందుకుంది.ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.తెలుగు, తమిళం మరియు హిందీ బాషలలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

    టాలీవుడ్ లో ఈమె ఒక్క ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ తో తప్ప, మిగిలిన అందరి స్టార్ హీరోల సరసన నటించింది.అయితే ఈమెకి గత కొంత కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతున్నాయి.ప్రస్తుతం ఈమె చేతిలో హిందీ సినిమాలు మాత్రమే ఉన్నాయి.తెలుగు లో ఈమెకి డోర్స్ క్లోజ్ అయ్యిపోయినట్టే అనుకోవచ్చు.

    ఇది ఇలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసే సంగతి అందరికీ తెలిసిందే.అంతే కాదు అడ్వెంచర్స్ చెయ్యడం ఈ హాట్ బ్యూటీ కి ఒక హాబీ లాంటిది, తాజాగా ఈమె మంచు కొండల మధ్యలో ఒక మంచుతో నిండి ఉన్న ఒక సరస్సులోకి దూకి కాసేపు ఈత కొట్టి పైకి వచ్చిన రకుల్ ప్రీత్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    మైనస్ 15 డిగ్రీల వాతావరణం లో రకుల్ ఈ సాహసాన్ని చేసింది.ఆమె చేసిన ఈ సాహసానికి సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇది వరకు ఆమె ఇలాంటివి ఎన్నో చేసింది, కానీ ఇంత మంచు కొండల్లో స్విమ్మింగ్ చెయ్యడం అనేది ప్రాణాలతో చెలగాటం ఆడడం లాంటిది.అందుకే ఆమెని అందరూ ఆ రేంజ్ లో పొగుడుతున్నారు.