Rakesh-Sujatha Love Story: ప్రేమ ఎప్పుడు ఎవరిపై పుడుతుందో తెలియదంటారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతకు పడిపోయాడు. స్నేహంగా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి వైపు మళ్లింది. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరిగా ఉన్నారు. టీం లీడర్ అయిన రాకింగ్ రాకేష్ చిన్న పిల్లలను తన టీమ్ సభ్యులుగా చేసుకొని మంచి హాస్యం పండిస్తారు. రాకింగ్ రాకేష్ టీమ్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాకేష్ టీమ్ లోకి రెండేళ్ల క్రితం జోర్దార్ సుజాత ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకింగ్ రాకేష్ స్కిట్స్ చేయడం మొదలుపెట్టారు.

ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రొఫెషనల్ ప్రయాణంలో రాకేష్-సుజాత మనసులు కలిశాయి. జబర్దస్త్ షో వేదికగా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరుచుకున్నారు. రష్మీ-సుధీర్, వర్ష-ఇమ్మానియేల్ ప్రేమ మాదిరి వీరిది కూడా ఉత్తుత్తి ప్రేమని మొదట్లో అనుకున్నారు. అయితే సీరియస్ గా లవ్ లో మునిగిపోయారని తర్వాత తెలిసొచ్చింది. కొన్నాళ్లుగా సుజాత రాకింగ్ రాకేష్ ఇంట్లో ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యుల్లో ఆమె కలిసి పోయారు. ఫ్యామిలీ మెంబర్ అయ్యారు.
ఇటీవల సుజాత బర్త్ డేను రాజేష్ దుబాయ్ లో గ్రాండ్ గా జరిపారు. సుజాత, రాజేష్ ఫ్రెండ్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. త్వరలో అధికారికంగా పెళ్లి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ముగిశాక రాకేష్ రింగ్ ఇచ్చి సుజాతకు ప్రపోజ్ చేశారు. ఆమె వేలికి రింగ్ తొడిగి హగ్ చేసుకున్నాడు. నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. జబర్దస్త్ మిత్రులు రాకేష్-సుజాతల జంటకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాకేష్-సుజాత పెళ్లి పీటలు ఎక్కనున్న ట్లు తెలుస్తుంది.

సుజాత విషయంలో రాకేష్ తల్లి చాలా సంతోషంగా ఉన్నారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో రాకేష్ తల్లిగారు మాట్లాడారు. రాకేష్ అసలు పెళ్లి చేసుకోను అన్నాడట. దీంతో ఆమె చాలా ఆందోళన చెందారట. రాకేష్ తమ్ముడికి పెళ్ళై పిల్లలు ఉన్నారట. రాకేష్ మదర్ బయటికెళ్తే బంధువులు పెద్ద కొడుకు పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారట. రాకేష్ మనసు మార్చి అతని జీవిత భాగస్వామిగా వస్తున్న సుజాతపై ఆమె అమితమైన ప్రేమ కనబరుస్తున్నారు. ఇక ఆమె వచ్చాక ఇల్లు సందడిగా మారింది. మా ఇంట్లో మరో చిన్న పిల్లలాగా గలగలా మాట్లాడుతూ సుజాత అల్లరి చేస్తుందని రాకేష్ తల్లి చెప్పడం విశేషం.
