
Rajiv Kanakala- Suma: టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో సుమ-రాజీవ్ కనకాల ఒకరు. వీరిద్దరూ తమ తమ ప్రొఫెషన్స్ లో సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్నారు. 1999 ఫిబ్రవరి 10న వీరి వివాహం జరిగింది. 24 ఏళ్ల వివాహ బంధం పూర్తి చేసుకున్నారు. ఆ మధ్య సుమ-రాజీవ్ విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఈ వార్తలకు రాజీవ్ క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులు విడిగా నేను నాన్నగారు జీవించిన పాత ఇంట్లో ఉన్నాను. దానికే సుమ నేను విడిపోయామని కథనాలు వల్లించారు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్వయంగా వెల్లడించారు. ఒక షోకి రాజీవ్ ని గెస్ట్ గా పిలిచిన సుమ పరోక్షంగా విడాకుల వార్తలకు చెక్ పెట్టింది.
సుమ దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. కొడుకును హీరో చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. కాగా సుమను రాజీవ్ కనకాల లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళికి ముందు ఆయన ఒక షాకింగ్ కండిషన్ పెట్టాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని సుమ స్వయంగా చెప్పారు. హైదరాబాద్ లో పెరిగిన మలయాళీ అమ్మాయి సుమ. తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబంతో ఇక్కడికి వచ్చారు.
తాను హీరోయిన్ కావాలనుకున్నారు. ఆ ప్రయత్నాల్లో ఉన్న రోజుల్లోనే రాజీవ్ కనకాల పరిచయమయ్యాడు. ఆయన కూడా వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. పెళ్లయ్యాక నటించే ఆలోచన వదిలేయాలని సుమకు రాజీవ్ కండీషన్ పెట్టాడట. అది నచ్చని సుమ గుడ్ బై అనేసిందట. సుమ దూరమయ్యాక మెత్తబడిన రాజీవ్, ఓకే నీ ఇష్టానికి అడ్డు చెప్పను. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడట.

ఆ విధంగా రాజీవ్-సుమ పెళ్లిపీటలెక్కారు. నటిగా ఆఫర్స్ రాకపోవడంతో సుమ యాంకర్ గా మారారు. తన వాక్చాతుర్యంతో తిరుగులేని యాంకర్ గా ఎదిగారు. భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమకు ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. ఒక మలయాళీ అంత అనర్గళంగా, నాణ్యమైన తెలుగు మాట్లాడటం గొప్ప విషయం. మరోవైపు రాజీవ్ నటుడిగా ఫేమ్ తెచ్చుకున్నాడు. విలన్, కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ పరిశ్రమలో బిజీ అయ్యారు. ఇక సుమ ఆస్తులు కోట్లలో ఉన్నాయి. దశాబ్దాల పాటు యాంకర్ గా రాణించిన సుమకు స్టార్ హీరోయిన్ ని మించిన సంపాదన ఉంది. ఇటీవల యాంకరింగ్ మానేస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చిన సుమ, కొత్త షో స్టార్ట్ చేశారు.