
Lokesh Kanagaraj- Rajinikanth: ఇటీవల కాలం లో కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీ ని ఏలేస్తున్నారు, నిన్న గాక మొన్న వచ్చినప్పటికీ కూడా ఎప్పటి నుండో ఇండస్ట్రీ ని శాశిస్తునాం దిగ్గజ దర్శకులకు ఫిలిం మేకింగ్ లో సవాలు విసురుతున్నారు. అలాంటి డైరెక్టర్స్ లో ఒకడు లోకేష్ కనకరాజ్. తెలుగు లో ఈయన సందీప్ కిషన్ తో ‘నగరం’ అనే సినిమా చేసాడు. ఇదే ఆయన తొలి సినిమా కూడా, అక్కడి నుండి ప్రారంభమైన లోకేష్ కెరీర్ ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది.
ఈ సినిమా తర్వాత తమిళం లో సూపర్ హిట్స్ కొట్టాడు కానీ, ఆయనకీ మంచి గుర్తింపు ని తీసుకొచ్చిన సినిమా మాత్రం కార్తీ తో చేసిన ‘ఖైదీ’ అనే చిత్రమే.ఈ సినిమా లోకేష్ కెరీర్ ని మలుపు తిప్పింది, ఈ చిత్రం తర్వాత వెంటనే ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘మాస్టర్’ అనే సినిమా చేసాడు.
ఈ సినిమా ఊహించినట్టు గానే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, ఇక ఈ చిత్రం తర్వాత ఆయన తన అభిమాన నటుడు కమల్ హాసన్ తో చేసిన ‘విక్రమ్’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని మడతపెట్టేసింది. సుమారుగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కమల్ హాసన్ ని మళ్ళీ స్టార్ హీరోల లీగ్ లోకి చేర్చింది.ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ తో రెండవసారి ‘లియో’ అనే చిత్రం చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న లోకేష్, ఈ చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడట.ఇటీవలే రజినీకాంత్ ని కలిసి కథ వినిపించగా ఆయన ఎంతో నచ్చాడని, జైలర్ మూవీ షూటింగ్ అయిపోగానే కాల్ షీట్స్ ఇస్తానని చెప్పాడట. తమిళ ప్రజలు దేవుడిలాగా కొలిచే రజినీకాంత్ ని డైరెక్షన్ చేసే ఛాన్స్ కొట్టేసాడు, ఈ సినిమా హిట్ అయితే ఇక నుండి ఆయన రాజమౌళి , శంకర్ లాంటి దర్శకులతో సమానం అని అంటున్నారు విశ్లేషకులు.