Mahesh Babu- Rajamouli: మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్న ప్రాజెక్ట్ రాజమౌళి చిత్రం. తన గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో రాజమౌళి మహేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు కథగా మహేష్ మూవీ ఉంటుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. స్క్రిప్ట్ పూర్తి కాగా… ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని సినిమాలు వచ్చినా మహేష్ తన లుక్ మార్చడు. కానీ తాజాగా రాజమౌళి సినిమా కోసం లుక్ మార్చినట్టుగా తెలుస్తోంది.

మహేష్ బాబు మాస్ రోల్స్ లో కూడా గడ్డం, మీసంతో కనిపించిన సందర్భం లేదు. భరత్ అనే నేను మూవీలో మహేష్ ఒక పాటలో మీసంతో కనిపించారు. ఆయన అచ్చు కృష్ణలా అనిపించారు. ఇక గడ్డం పెంచడం అంటే సరే సరి. టక్కరి దొంగతో పాటు కొన్ని సినిమాల్లో మహేష్ లైట్ గడ్డం ట్రై చేశారు.
రెండు దశాబ్దాల కెరీర్లో మహేష్ గుబురు గడ్డంతో నటించలేదు. తాజాగా ఆయన నిండు గడ్డంలో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ లుక్ సరికొత్తగా ఉంది. మాస్ లుక్ లో మహేష్ హాలీవుడ్ యాక్షన్ హీరో కీను రీవ్స్ ని తలపించాడు. జాన్ విక్ మూవీలో కీను రీవ్స్ లుక్ ఇలానే ఉంటుంది. లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి నచ్చేయగా వైరల్ చేస్తున్నారు.

ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమేనని సమాచారం. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘నా తర్వాతి సినిమా మహేష్ తోనే.. అతడు తెలుగు ఇండస్ట్రీలో అతిపెద్ద స్టార్. ఇండియన్ జోనర్ లో ఓ అడ్వెంచర్ సినిమా తీయబోతున్నాను. ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈ మూవీ చాలా కాలం సాగుతుంది ’ అంటూ రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచే కామెంట్స్ చేశాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.