
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ప్రఖ్యాత సినిమా వేదికపై పాట పాడే అరుదైన గౌరవం అందుకున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ 95వ వేడుకలో లైఫ్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ అంతర్జాతీయ ఈవెంట్లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైఫ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు అకాడమీ సభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆస్కార్ వేడుకకు ఆహ్వానం లభించడమే గౌరవంగా భావిస్తారు. అలాంటిది ప్రపంచ సినిమా దిగ్గజాల ముందు లైవ్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం రావడం లైఫ్ టైం అఛీవ్మెంట్ అని చెప్పవచ్చు.
నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ సాధించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నాటు నాటు సాంగ్ స్వరపరిచారు. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. నాటు నాటు సాంగ్ ఆలపించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై పాడే అరుదైన అవకాశం అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆస్కార్స్ లో సందడి చేయనున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆర్ ఆర్ ఆర్ టీమ్ అమెరికా వెళ్లడం జరిగింది
హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ పాల్గొన్నారు. అవార్డులు గెలుచుకోవడం జరిగింది. రామ్ చరణ్ ని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన్ని స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించారు. HCA అవార్డ్స్ ఈవెంట్లో రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ అరుదైన గౌరవాలు అందుకున్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోకి హాజరైన మొదటి ఇండియన్ గా రికార్డులకు ఎక్కారు.

ఇది నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకుంటుందని టీమ్ దృఢ విశ్వాసంతో ఉన్నారు. గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న నేపథ్యంలో ఆస్కార్ కూడా సొంతం అవుతుందని భావిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ జర్నీని ఆసక్తిగా గమనిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలిచుకుంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధించిన అతి పెద్ద విజయం అవుతుంది. ఇక ఆస్కార్ వేడుకకు ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఆయన మార్చి 6న అమెరికా వెళుతున్నట్లు సమాచారం
Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars.
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs
— The Academy (@TheAcademy) February 28, 2023