
Rudrudu Collections: రాఘవ లారెన్స్ సినిమాలు అంటే మన తెలుగు మాస్ ఆడియన్స్ కి బాగా ఇష్టం.ముఖ్యంగా ఆయన సినిమాల్లోని ఫైట్స్ మరియు డ్యాన్స్ బాగుంటుంది కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఓపెనింగ్ వచ్చేస్తుంది.ఆయన హీరో గా నటించిన స్టైల్, ముని, కాంచన, గంగ, కాంచన 3 వంటి చిత్రాలు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలుగా నిలిచాయి.
అందుకే రీసెంట్ గా విడుదలైన ‘రుద్రుడు’ సినిమాకి ఎలాంటి ప్రొమోషన్స్ చెయ్యకపోయినా 7 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.బ్రేక్ ఈవెన్ నెంబర్ చాలా కష్టమే కానీ ఓపెనింగ్స్ మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చింది.మొదటి రోజు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
జీరో హైప్ ఉన్న ఒక సినిమాకి ఈ ఓపెనింగ్ డీసెంట్ అనే చెప్పాలి, రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది.కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే డీసెంట్ గా ఆడితే మాత్రం సరిపోదు, కచ్చితంగా బలంగా ఆడాలి.కానీ ఈ సినిమా వర్కింగ్ డేస్ లో రాబడుతున్న వసూళ్లు అంతంత మాత్రమే.చాలా ప్రాంతాలలో షేర్స్ రావడం కూడా ఆగిపోయింది.మొత్తం మీద ఈ చిత్రం విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది.ఈ వారం రోజులకు గాను ఈ చిత్రం రాబట్టిన వసూళ్లు కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే.

ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి.ఈరోజు విరూపాక్ష మూవీ విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది, వచ్చే వారం అక్కినేని అఖిల్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ విడుదలకు సిద్ధం గా ఉంది.ఈ రెండు సినిమాల జోరుని తట్టుకొని రుద్రుడు నిలబడలేదు.కాబట్టి ఈ సినిమాని కొన్న బయ్యర్స్ కి 5 కోట్లు నష్టం వాటిల్లింది అన్నమాట.