Race horses worth 2 crores died in bee attack.. : కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని ఓ ఫామ్ లో రెండు రేసు గుర్రాలు మృత్యువాత పడ్డాయి. మేత కోసం వెళ్లిన గుర్రాలపై తేనెటీగలు దాడి చేయడంతో చికిత్స పొందుతూ చనిపోయాయి. రోజు లాగే ఎయిర్ సపోర్టు, సానస్ ఫర్ అక్బం అనే రెండు గుర్రాలు మేత కోసం గురువారం బయటకు వచ్చాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో తేనెటీగలు గుర్రాలను కుట్టాయి. దీంతో అవి బాధ తాళలేక అక్కడే కిందపడిపోయాయి. అది గమనించిన సంరక్షకులు వైద్యులను పిలిపించి చికిత్స అందించినా ఒకటి గురువారం రాత్రి చనిపోగా మరొకటి శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో దాని యజమాని వేదనకు గురయ్యాడు.
యునైటెడ్ రేంసింగ్ అండ్ బ్లడ్ స్టాక్ బ్రీడర్స్ (యూఆర్ బీబీ)కి రూ. కోట్ల నష్టం వచ్చింది. ఐర్లాండ్ కు చెందిన సానస్ పర్ అక్బం ( పది సంవత్సరాలు), అమెరికాకు చెందిన ఎయిర్ సపోర్ట్ ( పదిహేను సంవత్సరాలు) రెండు మగ గుర్రాలను పోటీల కోసం తీసుకొచ్చారు. ఇవి పోటీలో పాల్గొన్నాయంటే విజయం ఖాయం. దీంతో నిర్వాహకులు వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అయినా తేనెటీగల దాడితో అవి చనిపోవడం వారిలో విషాదాన్ని నింపింది. రేసు గుర్రాలు కావడంతో వారికి ఎంతో నష్టం వచ్చింది.
అమెరికాకు చెందిన ఎయిర్ సపోర్ట్, వర్జీనియా డెర్సీ అండ్ పిల్ గ్రామా స్టేక్స్, ట్రాన్స్ లానియా స్టేక్స్, సెకండ్ యునైెడ్ నేషన్స్ స్టేక్స్, థర్డ్ అమెరికన్ టర్ప్ స్టేక్స్, సెకండ్ హిల్ ప్రిన్స్ స్ట్రేక్స్ లాంటి రేసుల్లో ఇవి విజయం సాధించాయి. వాటి యజమానులకు కనకవర్షం కురిపించింది. దీంతో దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఐర్లాండ్ కు చెందిన గుర్రం సానస్ పెర్ అక్బమ్ ఫైవ్ స్టార్ రేసులో మూడు సార్లు గెలిచి యజమానులకు కోట్లు రాబట్టింది. వీటిని ఆరేళ్ల క్రితం అమెరికా, ఐర్లాండ్ ల నుంచి తెప్పించారు. ఒక్కో గుర్రం ఖరీదు రూ. కోటి చొప్పున కొనుగోలు చేశారు. రెండు గుర్రాలకు పుట్టిన పిల్లలు కూడా ప్రపంచ వ్యాప్తంగా తరలించారు. ఇలా ఈ గుర్రాలకు ఇంతటి డిమాండ్ ఉండటంతో వాటిని ఎంతో బాగా చూసుకుంటున్నారు. కానీ చుట్టుపక్కల తేనెటీగలు ఉన్న విషయం మాత్రం వారు గుర్తించనట్లు తెలుస్తోంది.
బ్రీడింగ్ పద్ధతిలో వీటి సంతతికి ఎంతో డిమాండ్ ఏర్పడింది. దేశ విదేశాల్లో వీటి పిల్లలు పెరుగుతున్నాయంటే వాటి విలువ ఎంత ఉందో తెలుస్తుంది. వీటిని రూ. లక్షలు పెట్టి కొనుగోలు చేసుకుని మరీ వెళ్లారు. అలా ఈ ఫామ్ లో వీటిని సంరక్షణ చేపడుతున్నారు. ఈ ఫామ్ ను 30 ఏళ్లకు గాను యూఆర్ బీబీకి లీజుకు తీసుకున్నారు. ఈ లీజు వ్యవధి కూడా గత సెప్టెంబర్ తో ముగిసినా కొన్ని కారణాల వల్ల మరికొన్ని రోజులు పొడగించుకుని ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇలా జరగడం వారిలో ఆందోళన పెంచింది. గుర్రాల మృతితో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రూ. రెండు కోట్ల విలువ చేసే గుర్రాలు చనిపోవడం నిర్వాహకుల్లో భయం కలిగేలా చేసింది.