Raashii Khanna : పాలమీగడలాంటి నుదురు, దొండ పండ్ల వంటి పెదవులు, చిక్కటి చీకటిలాంటి కురులు, దానికి తగ్గట్టుగా దేహం.. ఇలా ఉంది కాబట్టే పక్కా కమర్షియల్ సినిమాలో “అందాలరాశి.. మేకప్ వేసి నా ముందుకు వచ్చావే” అని గోపీచంద్ పాడాడు.. అప్పుడెప్పుడో పుష్కరం క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రాశీ ఖన్నా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నది. తెలుగు, తమిళం, హిందీ లో వరుస సినిమాల చేస్తోంది.. ప్రస్తుతం రాశి ఖన్నా నటించిన యోధ అనే హిందీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలలో రాశీ పాల్గొన్నది. చిత్ర యూనిట్ తో కలిసి ఉత్తర భారతదేశాన్ని మొత్తం చుట్టి వచ్చింది.
అందానికి తగ్గట్టు అభినయం ప్రదర్శిస్తుంది కాబట్టే.. రాశి తెలుగులో పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఇప్పటికీ తొలిప్రేమ సినిమాలో వర్ష అనే పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేదు. ఆ పాత్రలో రాశి ఒదిగిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆమెను చాలామంది అభిమానులు వర్ష అనే సంబోధిస్తారు. హోమ్లీ పాత్రలు మాత్రమే కాకుండా అధునాతన వస్త్రాలు ధరించి మోడ్రన్ క్యారెక్టర్స్ లో కూడా రాశి మెప్పించింది.. హైపర్ సినిమాలో ఆమె నటించిన పాత్రే ఇందుకు ఉదాహరణ. త్వరలో విడుదలయ్యే యోధ సినిమాలో తన పాత్ర భిన్నంగా ఉంటుందని రాశి చెబుతోంది.
ఇటీవల రాశి ఖన్నా ఫొటో షూట్ లో పాల్గొన్నది. ఈ సందర్భంగా తనలో అందాన్ని దిగుణీకృతం చేసే అధునాతనమైన దుస్తులు ధరించింది. ఆ దుస్తుల్లో రాశి నిజంగానే అందాల రాశి లాగా మెరిసిపోతోంది. ఇటీవల యోధ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లో ఎరుపు రంగు దుస్తులు వేసుకొని అభిమానులను అలరించిన రాశి.. తాజా ఫోటోషూట్ తో ఐ ఫీస్ట్ అందించింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసినవారు అందాల రాశి.. అందాల రాక్షసి కూడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.