
Raashi Khanna: ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా ఫార్జీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫేక్ కరెన్సీ నేపథ్యంలో క్రైమ్ డ్రామాగా ఫార్జీ రూపొందించారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. బాలీవుడ్ నటుడు కేకే మీనన్ కీలక రోల్ లో మెరిశారు. రాశి ఫార్జీ సిరీస్లో ఆర్బీఐ ఎంప్లాయ్. ఫేక్ కరెన్సీ ఎక్స్పర్ట్. విజయ్ సేతుపతి ఇన్వెస్టిగేషన్ కి సహకరించే మేఘగా రాశి సూపర్ గా సెట్ అయ్యారు.
ఫార్జీ సక్సెస్ కావడంతో రాశి బాలీవుడ్ లో బిజీ అవుతానని ఆశిస్తున్నారు. సినిమాలు, సిరీస్ల ఆఫర్స్ వెల్లువెత్తుతాయని ధీమాగా ఉన్నారు. ది ఫ్యామిలీ మాన్ 2లో నటించిన సమంత బాగా లబ్ధి పొందారు. ఆమెకు బాలీవుడ్ బడా బ్యానర్స్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ సిటాడెల్ సిరీస్లో నటిస్తున్నారు. అదే విధంగా రాశి దశ తిరిగే అవకాశాలను కొట్టిపారేయలేం.

ప్రస్తుతం రాశి ఒక బాలీవుడ్ చిత్రం చేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ యోధ మూవీలో రాశి హీరోయిన్. దిశా పటాని మరో హీరోయిన్ గా చేస్తున్నారు. యోధ జులైలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యోధ విజయం సాధించినా కూడా రాశి బాలీవుడ్ ఆశలు సజీవంగా ఉన్నట్లే. టాలీవుడ్ లో మాత్రం అవకాశాల దార్లు మూసుకుపోయాయి. ఆఫర్స్ వచ్చే సూచనలు లేవు. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలతో హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేశారు.
కోలీవుడ్ లో ఒకింత పర్లేదు, ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశిని పెళ్లి చేసుకోబోతున్నారట కదా? అని అడిగితే అదేం లేదన్నారు. మరి కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించకపోవడానికి కారణం ఏమిటని అడగ్గా… నేను సినిమాలు తగ్గించలేదు. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని కథలు విన్నాను. వాటిలో కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేసే అవకాశం కలదన్నారు.

బాలీవుడ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైనప్పటికీ… రాశి స్టార్ గా ఎదిగింది టాలీవుడ్ చిత్రాలతోనే. ఊహలు గుసగుసలాడే మూవీతో ఫస్ట్ హిట్ కొట్టిన రాశి ఖన్నా తొలిప్రేమ, జై లవకుశ వంటి చిత్రాలు ఫేమ్ తెచ్చాయి. 2019లో విడుదలైన ప్రతిరోజూ పండగే చిత్రం రాశి కెరీర్లో భారీ హిట్ అని చెప్పొచ్చు. సాయి ధరమ్ హీరోగా నటించిన ప్రతిరోజూ పండగే చిత్రంలో ఆర్నా గా రాశి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆ రేంజ్ హిట్ మళ్ళీ రాశికి తగ్గలేదు.