https://oktelugu.com/

Bheemla Nayak vs Pushpa: పుష్ప వర్సెస్ భీమ్లానాయక్: పవన్, అల్లు అర్జున్ లలో ఎవరు గెలిచారంటే?

Bheemla Nayak vs Pushpa: ‘తగ్గేదేలే అంటూ ’ తెలుగు సినీ జనాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మదిని దోచేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ రికార్డుల మోత మోగించాడు. కరోనా టైంలో వచ్చిన ఈ మూవీకి పోటీ లేకపోవడంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఎలాంటి హైప్ లేకుండా టైం కూడా లేక ఆగమాగమే ఆ సినిమాను విడుదల చేశారు. ‘పుష్ప’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కూడా పాల్గొనలేదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 24, 2022 / 08:11 PM IST
    Follow us on

    Bheemla Nayak vs Pushpa: ‘తగ్గేదేలే అంటూ ’ తెలుగు సినీ జనాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మదిని దోచేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ రికార్డుల మోత మోగించాడు. కరోనా టైంలో వచ్చిన ఈ మూవీకి పోటీ లేకపోవడంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఎలాంటి హైప్ లేకుండా టైం కూడా లేక ఆగమాగమే ఆ సినిమాను విడుదల చేశారు. ‘పుష్ప’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కూడా పాల్గొనలేదు. కానీ ఆ సినిమా బంపర్ హిట్ కొట్టింది.

    Bheemla Nayak vs Pushpa

    ఇప్పుడు ‘భీమ్లానాయక్’ విడుదలైంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమాకు మంచి టాక్స్ వచ్చాయి. పవన్, రానాల పర్ ఫామెన్స్ కు థియేటర్లు ఈలలు, గోలలతో చెలరేగిపోతున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కు ఇది మరో బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప’ రికార్డులు భీమ్లానాయక్ బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు.

    బాలీవుడ్ లో భీమ్లానాయక్ విడుదల ఆలస్యమవుతోంది. తెలుగు కలెక్షన్లు చూస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన దృష్ట్యా.. ఖచ్చితంగా ప్రీబుకింగ్స్ తోపాటు వారం రోజుల కలెక్షన్ల లెక్కలు తీస్తే పుష్ప రికార్డులను భీమ్లానాయక్ బద్దలు కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: Bheemla Nayak Movie AP Govt: భీమ్లానాయక్ పై జగన్ సర్కార్ నెగిటివ్ ప్రచారం

    దీన్ని బట్టి అల్లుడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో నెలకొల్పిన రికార్డులను మామయ్య పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’తో బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. మామ అల్లుల్లు ఇద్దరూ ఈ గ్యాప్ లో రికార్డుల మోత మోగిస్తున్నట్టు అర్థమవుతోంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లానాయక్ ’ విడుదలవుతోంది. ఇప్పటికే యూఎస్, ఓవర్సీస్, హైదరాబాద్ లో ప్రీ షోలు పడుతున్నాయి. టాక్ పాజిటివ్ గా వస్తోంది.దీంతో ‘పుష్ప’ రికార్డులు బద్దలవ్వడం ఖాయమంటున్నారు.

    Also Read: Bheemla Nayak vs Akhanda Pushpa Collections: అఖండ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్ కింగ్ ఎవరు?

    Recommended Video: