https://oktelugu.com/

Pushpa The Rule : రేపు 11 గంటలకు ‘పుష్ప : ది రూల్’ టీజర్ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్ కి ఇక పండగే!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లోప్ వచ్చిన పుష్ప : ది రూల్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజి ని తెచ్చిపెట్టింది ఈ సినిమా.ముఖ్యంగా నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ కి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది.రాజమౌళి సహాయం లేకుండా పాన్ ఇండియా లో జెండా పాతేసిన హీరో గా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 4, 2023 / 05:00 PM IST
    Follow us on

     

     

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లోప్ వచ్చిన పుష్ప : ది రూల్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజి ని తెచ్చిపెట్టింది ఈ సినిమా.ముఖ్యంగా నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ కి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది.రాజమౌళి సహాయం లేకుండా పాన్ ఇండియా లో జెండా పాతేసిన హీరో గా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

    అంత పెద్ద కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పుష్ప 2 కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, కోట్లాది మంది సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండును అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్.

    అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి మూడు నిమిషాల యాక్షన్ టీజర్ ని సిద్ధం చేసాడట డైరెక్టర్ సుకుమార్.ఈ టీజర్ ని అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు విడుదల చెయ్యబోతున్నారు.దీనికి సంబంధించిన అప్డేట్ రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మూవీ టీం అధికారికంగా విడుదల చేసారు.ప్రకటన పోస్టర్ చూడగానే గూస్ బంప్స్ వచ్చేసాయి, ఇక టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

    పార్ట్ 2 పై కనీవినీ రేంజ్ అంచనాలు ఉండడం తో, డైరెక్టర్ సుకుమార్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట.పుష్ప పార్ట్ 1 ట్విస్టులు పెద్ద గా ఏమి ఉండవు.కానీ పుష్ప 2 లో మాత్రం ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయ్యే రేంజ్ సుకుమార్ మార్క్ ట్విస్టులు ఉంటాయట.ఈ ఏడాది చివర్లో కానీ, లేదా సంక్రాంతి కానుకగా కానీ ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.