
Pushpa The Rule Teaser: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’ కి సంబంధించిన టీజర్ రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు విడుదల చేసారు. టీజర్ చూస్తున్నంతసేపు ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే విధంగానే అనిపించింది. సుకుమార్ సినిమాల్లో హీరో ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇందులో అల్లు అర్జున్ ని ఇంతకు ముందు తన హీరోల క్యారెక్టర్స్ కంటే ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. సాధారణంగా డైరెక్టర్స్ తమ హీరోలను పులి లేదా సింహం తో పోల్చి చూస్తారు. కానీ పుష్ప లో మాత్రం పులి హీరోని చూసి రెండు అడుగులు వెనక్కి వెయ్యడం చూపించిన షాట్ టీజర్ మొత్తానికి హైలైట్ గా నిల్చింది. ఇలాంటి ఆలోచన ఇప్పటి వరకు మన టాలీవుడ్ దర్శకులలో ఎవరికీ రాలేదు, ఒక్క సుకుమార్ కి తప్ప.ఆ క్రియేటివ్ జీనియస్ మేకింగ్ కి ప్రతీక ఈ షాట్.

హీరో ని ఎలివేట్ చెయ్యడం లో తనని మించిన డైరెక్టర్ లేదు అని నిరూపించాడు సుకుమార్.ఈ టీజర్ లో సినిమా మొత్తాన్ని చూపించేసాడు. పుష్ప పార్ట్ 1 లో పుష్ప కి మరియు పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షికావత్ కి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే.పుష్ప తన పొగరు ని చూపిస్తే భన్వర్ సింగ్ షికావత్ తన పవర్ ని చూపించి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి, ఎన్కౌంటర్ చెయ్యడానికి తీసుకెళ్తాడు.
ఇలా పోలీసుల ఎన్ కౌంటర్ లో పుష్ప చనిపోయాడు అని జనం ఫిక్స్ అయిన టైంలో పుష్ప పులుల కోసం పెట్టిన కెమెరాకు చిక్కుతాడు. పులి పక్కనే కనిపిస్తాడు. అంటే పుష్ప పోలీస్ ఎన్కౌంటర్ నుండి తప్పించుకొని అందరిని చంపేసి అడవిలోకి వెళ్ళిపోతాడా..? , లేదా కేవలం పోలీసులను తప్పించుకొని వేషం మార్చుకొని తిరుగుతూ తనని ఇబ్బంది పెట్టినవారిని చంపుతాడా అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.