
Pushpa 2 – The Rule : పుష్ప1 రిలీజ్ కాగానే అందరూ ఎర్రచందనం స్మగ్లర్ అయిన పుష్పను ఎందుకు హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నారు? అతడో దొంగ అని ఆడిపోసుకున్నారు. గరికపాటి నరసింహారావు లాంటి వేధాంతులు, మేధావులు అయితే ఒక దొంగను హీరోను చూసి చూపిస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారయ్యా అంటూ ఆడిపోసుకున్నారు. ఇలాంటి సినిమాలు మన సంస్కృతిని పాడు చేస్తాయని.. పిల్లలను చెడగొడుతాయంటూ తిట్టిపోశారు.
అయితే వీటన్నింటికి సమాధానాన్ని పుష్ప2లో ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. రెండో ట్రైలర్ తాజాగా విడుదలై అందరి అంచనాలను మించిపోయేలా ఉంది.
పుష్ప 1లో స్మగ్లర్ గా కనిపించిన పుష్పను అందరూ విలన్ అనుకున్నారు. ఎర్రచందనం దుంగల దొంగతనంతో పుష్ప కు వచ్చిన కోట్ల డబ్బుతో ఏం చేశాడన్నది రెండో పార్ట్ లో చూపించారు. పోలీస్ కమిషనర్ తో గొడవపడ్డ పుష్ప పార్ట్ 1 ఎండింగ్ ను రెండో పార్ట్ లో చూపించాడు సుకుమార్. తాజాగా విడుదలైన టీజర్ లో పుష్పను పోలీసులు వెంటాడడం.. అడవుల్లో పారిపోవడం.. ఆ తర్వాత అతడి చొక్కాపై 8 బుల్లెట్లతో కనిపించడం.. పుష్ప బాడీ దొరకకపోవడంతో చిత్తూరు జిల్లా మొత్తం అట్టుడికిపోతుంది. జనాలంతా పుష్ప కోసం స్వయంగా ఆందోళనలు చేయడం చూపించారు. నెలరోజుల పాటు అట్టుడికిస్తారు. ఈ క్రమంలోనే పుష్ప చేసిన మంచి పనులన్నింటిని జనాలు గుర్తు చేసుకుంటారు. అతడు చేసిన గుండె ఆపరేషన్లు, పెళ్లిళ్లు సాయాలను, జనాలకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాళ్ల గుండెల్లో పుష్ప నిలిచిపోయాడు అన్నట్టుగా చూపించారు. పుష్ప బతకాలని పూజలు, చేసి కోరుకునే జనాల అభిమానాన్ని చూపించారు. దీంతో ఫస్ట్ పార్ట్ లో విలన్ గా ఉన్న పుష్ప సెకండ్ పార్ట్ లో హీరోగా మారిపోయాడని.. సుకుమార్ అలా మార్చేశాడని అంటున్నారు.
ఈ టీజర్ తో పుష్ప విలన్ కాదు హీరో అని.. జనాల కోసమే ఆ ఎర్రచందనం డబ్బు ఖర్చు చేశాడని.. వారి ఆకలి అవసరాలు తీర్చాడని అర్థమైంది. మరి గరికపాటి లాంటి వారు ఇప్పటికైనా ఈ రెండో పార్ట్ సినిమాపై విమర్శల వాడి ఆపుతారో లేక అలానే కంటిన్యూ చేస్తారో చూడాలి.