https://oktelugu.com/

India Vs Bangladesh: ఇండియా -బంగ్లాదేశ్ మ్యాచ్ లో పుష్ప సాంగ్… బన్నీ నీ రేంజ్ వేరంటున్న ఫ్యాన్స్!

అది స్క్రీన్ పై చూసి డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఇండియన్ క్రికెటర్స్ ఎంజాయ్ చేశారు. ఒకపక్క మ్యాచ్ చేజారుతున్న విషయం పట్టించుకోకుండా సాంగ్ ని ఎంజాయ్ చేయడం కూడా కెమెరామెన్ బంధించాడు.

Written By:
  • Shiva
  • , Updated On : September 16, 2023 / 03:37 PM IST

    India Vs Bangladesh

    Follow us on

    India Vs Bangladesh: ఆసియా కప్ 2023లో ఇండియా ఫైనల్ కి దూసుకెళ్లింది. అయితే బంగ్లాదేశ్ తో జరిగిన నామ మాత్రపు మ్యాచ్ లో ఇండియా ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్టేడియం లో పుష్ప చిత్రంలోని ”నా సామి’ సాంగ్ ప్లే చేశారు. ఆ సాంగ్ కి స్టేడియం లో ఉన్న ఓ చిన్నారి డాన్స్ చేయడంతో కెమెరా మెన్ తన కెమెరా అటువైపు తిప్పాడు. ఆ చిన్నారితో పాటు కొందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా ఆ సాంగ్ ఎంజాయ్ చేశారు.

    అది స్క్రీన్ పై చూసి డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఇండియన్ క్రికెటర్స్ ఎంజాయ్ చేశారు. ఒకపక్క మ్యాచ్ చేజారుతున్న విషయం పట్టించుకోకుండా సాంగ్ ని ఎంజాయ్ చేయడం కూడా కెమెరామెన్ బంధించాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పుష్ప మూవీ సాంగ్ ప్లే చేయడం, ఆడియన్స్ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది అల్లు అర్జున్ ఫేమ్ కి నిదర్శనం అంటున్నారు. నీ లెవెల్ వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2021లో విడుదలైన పుష్ప హిందీలో భారీ విజయం సాధించింది. అల్లు అర్జున్ కి నార్త్ తో విపరీతమైన ఫేమ్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా దేవిశ్రీ సాంగ్స్ అందించారు. ఈ సాంగ్స్ విపరీతమైన ఆదరణ దక్కించుకున్నాయి. పుష్ప హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    వీటన్నింటికీ మించి పుష్ప చిత్రం అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. టాలీవుడ్ నుండి ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కింది. ఇక పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కుతుంది. ఇటీవల విడుదల తేదీ ప్రకటించారు. ఆగస్టు వచ్చే ఏడాది 15న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు.