Pushpa Promotions In Russia: ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్ప రష్యాలో అదృష్టం పరీక్షించుకోనుంది. డిసెంబర్ 8న రష్యన్ భాషలో పుష్ప విడుదల అవుతుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్ కోసం టీమ్ రష్యా వెళ్లారు. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందాన, దేవిశ్రీతో పాటు నిర్మాతలు రష్యా వెళ్లారు. తీరిక లేకుండా పుష్ప టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. పుష్ప టీమ్ కి అక్కడ మంచి స్వాగతం లభించింది. మీడియా ప్రముఖులు, అభిమానులు పుష్ప టీమ్ తో ముచ్చటిస్తున్నారు.

కాగా ఒక దివ్యాంగ అభిమాని అల్లు అర్జున్ తో ఫోటో దిగాలని ఆశపడ్డారు. తన కోసం అల్లు అర్జున్ క్రింద కూర్చొని అభిమాని కోరిక తీర్చారు. రష్యాలో మూవీని సక్సెస్ చేయాలని టీమ్ చాలా కష్టపడుతున్నారు. దీంతో రష్యాలో పుష్ప ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ పుష్ప రష్యా రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంది. రష్యాలో మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డాన్సర్ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ చిత్రాలకు అక్కడ మార్కెట్ ఉంది.
ఇక త్వరలో పుష్ప 2 రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ సీక్వెల్ కి కేటాయించారట. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ భారీగా ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. ఒక్క అల్లు అర్జున్ రూ. 100 కోట్ల వరకు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. పుష్ప మంచి విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేర్పులు చేశారు. కొత్తగా కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేశారని వినికిడి. అలాగే రష్మిక మందాన క్యారెక్టర్ చనిపోతుందనే పుకార్లు తెరపైకి వచ్చాయి.

మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సిరీస్ నిర్మాతలుగా ఉన్నారు. సునీల్, అజయ్ ఘోస్ట్ పార్ట్ 1 లో విలన్స్ గా నటించారు. క్లైమాక్స్ లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ని పరిచయం చేశారు. పుష్ప క్లైమాక్స్ అదిరిపోయింది. ఇక పార్ట్ 2 లో ప్రధాన పోటీ… అల్లు అర్జున్-ఫహాద్ ఫాజిల్ మధ్యే ప్రధాన యుద్ధం జరగనుంది. విజయ్ సేతుపతి పార్ట్ 2 లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. పుష్ప చిత్రానికి దేవిశ్రీ మంచి సంగీతం అందించారు. పార్ట్ 2 కి కూడా ఆయనే మ్యూజిక్ అందిస్తున్నారు.