https://oktelugu.com/

Pushpa Russia : రష్యా దేశం లో ‘పుష్ప’ ప్రభంజనం..#RRR కి సవాలు విసరబోతున్న అల్లు అర్జున్

‘Pushpa movie’ is booming in Russia స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదలైన ఈ సినిమాకి మన ఇండియన్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు..ఇప్పటికి ఈ సినిమా మ్యానియా నార్త్ ఇండియాలో కొనసాగుతూనే ఉంది.   బాలీవుడ్ లో కేవలం కోటి రూపాయిల గ్రాస్ తో ప్రారంభమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2022 / 09:16 PM IST
    Follow us on

    ‘Pushpa movie’ is booming in Russia స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదలైన ఈ సినిమాకి మన ఇండియన్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు..ఇప్పటికి ఈ సినిమా మ్యానియా నార్త్ ఇండియాలో కొనసాగుతూనే ఉంది.

     

    బాలీవుడ్ లో కేవలం కోటి రూపాయిల గ్రాస్ తో ప్రారంభమైన ఈ సినిమా, ఫుల్ రన్ లో అక్కడ ఏకంగా 110 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిందంటే పుష్ప ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు..క్రికెటర్స్ మరియు ఫుట్ బాల్ ప్లేయర్స్ కూడా ‘తగ్గేదేలే’ మ్యానరిజం తో పిచ్చెక్కించారు..పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే, పాన్ వరల్డ్ రేంజ్ రీచ్ ని సంపాదించుకుంది..వరల్డ్ వైడ్ ఈ సినిమాకి మంచి రీచ్ రావడం తో ఇతర దేశాలలో ఎందుకు విడుదల చెయ్యకూడదు? అనే ఆలోచన నిర్మాతలకు తట్టింది.

    అందుకే ఈ చిత్రాన్ని అతి త్వరలోనే రష్యాలో ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..అందుకోసం అల్లు అర్జున్ ప్రొమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నాడు..డిసెంబర్ నెలలో ఈ చిత్రం రష్యా వ్యాప్తంగా విడుదల కాబోతుంది..ఇది ఇలా ఉండగా ఇటీవలే ఆగస్టు 30 వ తారీఖున మాస్కో లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ చిత్రాన్ని ఎంచుకొని ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..అందుకే రష్యా ప్రజలు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు.

    గత కొంత కాలం క్రితం రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం జపాన్ లో విడుదలై సంచలన విజయం సాధించింది..ఇప్పటికి కూడా ఈ సినిమా అక్కడ కలెక్షన్స్ పరంగా రోజుకో బెంచ్ మార్కుని సృష్టి ముందుకు దూసుకుపోతుంది..పుష్ప సినిమా కూడా అలా ఇతర దేశాలలో పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి..ఒకవేళ ఈ చిత్రాన్ని రష్యా ప్రజలు ఆదరిస్తే చైనా, జపాన్ వంటి ప్రాంతాలలో కూడా దబ్ చేసి విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు రెడీ గా ఉన్నారు.