Purandeswari Comments: ఎన్టీఆర్ అల్లుళ్లు కలిసిపోయారు. నారా, దగ్గుబాటి కుటుంబాలు ఒకటయ్యాయి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు కలిసి చూపించారు. ఒకరి కష్టాల్లో ఒకరు పాలుపంచుకుంటున్నారు. ఏపీ సీఎం గా చంద్రబాబును చూసేందుకు పురందేశ్వరి పరితపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ టిడిపి కోసం ఆమె గట్టిగానే ప్రయత్నం చేశారు. టిడిపి తో పొత్తు వద్దన్న బిజెపి పెద్దలను ఒప్పించారు. చివరకు అనుకున్నది సాధించారు. ప్రస్తుతం ఏపీ సీఎం గా చంద్రబాబు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. జనసేన అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేస్తుంది.
ప్రస్తుతానికి సమన్వయంగా..
అయితే ఈ ముగ్గురు నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్న క్రమంలో పురందేశ్వరి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈరోజు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రమంత్రి తో కలిసి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్థానిక ఎంపీగా సభకు అధ్యక్షత వహించారు పురందేశ్వరి. అయితే ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ సెగలు పుట్టిస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి అంటూ పవన్ కళ్యాణ్ ను ఆమె సంబోధించడం ఇప్పుడు వైరల్ అంశంగా మారింది. సోషల్ మీడియాలో అదే పనిగా ట్రోల్ అవుతుంది.
ఆ వివాదం తెరపై..
ఇప్పటికే సీఎం పోస్టు కోసం జనసైనికులు పరితపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను చూడాలని చూస్తున్నారు. అయితే మొన్న ఆ మధ్యన లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న టిడిపి శ్రేణుల డిమాండ్ ను జనసైనికులు గట్టిగానే రిప్లై ఇచ్చారు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలి అని డిమాండ్ చేశారు. ఇది రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. పార్టీల నాయకత్వాలు హెచ్చరించడంతో సద్దుమణిగింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పురందేశ్వరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం గా సంబోధించడం వివాదాస్పదంగా మారుతుంది. అలా అయితే చంద్రబాబు ఏం చేయాలో చెప్పండి పురందేశ్వరి గారు అంటూ సోషల్ మీడియాలో ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
“ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు”
– దివంగత నేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు. pic.twitter.com/0scdExAv2w
— Megha Shyam Reddy (@MSRv96) June 26, 2025