https://oktelugu.com/

‘Puli Meka’ web series : అక్షరాలా 100 మిలియన్ వ్యూస్..ఓటీటీ హిస్టరీ లో సరికొత్త రికార్డుని నెలకొల్పిన ‘పులి మేక’ వెబ్ సిరీస్

‘Puli Meka’ web series : వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడే కానీ ఒక్క హిట్టు కూడా దక్కడం లేదు పాపం ఆది సాయికుమార్ కి.ఇతని కెరీర్ మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే మొదటి సినిమా ప్రేమ కావాలి మినహా మరో హిట్ లేదు.అలా అని ఇతనికి అవకాశాలు రాకుండా లేకపోలేదు,వరుసగా సినిమాల మీద సినిమాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు.అయితే సినిమాల ద్వారా దక్కని సక్సెస్ ఓటీటీ లో ఒక వెబ్ సిరీస్ ద్వారా దక్కింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2023 / 09:41 PM IST
    Follow us on

    ‘Puli Meka’ web series : వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడే కానీ ఒక్క హిట్టు కూడా దక్కడం లేదు పాపం ఆది సాయికుమార్ కి.ఇతని కెరీర్ మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే మొదటి సినిమా ప్రేమ కావాలి మినహా మరో హిట్ లేదు.అలా అని ఇతనికి అవకాశాలు రాకుండా లేకపోలేదు,వరుసగా సినిమాల మీద సినిమాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు.అయితే సినిమాల ద్వారా దక్కని సక్సెస్ ఓటీటీ లో ఒక వెబ్ సిరీస్ ద్వారా దక్కింది.

    ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్ లో ఆది సాయి కుమార్ ఒక్క ముఖ్యమైన పాత్రని పోషించాడు.సిరీస్ మొత్తానికి హైలైట్స్ గా చెప్పుకోవాల్సి వస్తే వాటిల్లో ఆది సాయికుమార్ నటన కూడా ఉంటుంది.ఈమధ్యనే Zee5 యాప్ లో స్ట్రీమింగ్ అయినా ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి ఎవ్వరూ ఊహించని అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి దాదాపుగా 100 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చిందని zee5 సంస్థ ఇందాక ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి ఈ రేంజ్ వ్యూస్ రావడం అంటే మామూలు విషయం కాదు.ఇప్పటికీ ఈ సిరీస్ టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉంది.రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని మైల్ స్టోన్స్ ని ఈ వెబ్ సిరీస్ అందుకోబోతుందో చూడాలి.

    చక్ర వర్తి రెడ్డి దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే అందించగా, ప్రముఖ రచయితా కోన వెంకట్ కథ మరియు మాటలు అందించడమే కాకుండా, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టాడు.బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న సిరి కి కూడా ఈ వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడింది.ఇక మొదటి నుండి కేవలం కేవలం రోల్స్ కి మాత్రమే పరిమితం అవుతూ వచ్చిన లావణ్య త్రిపాఠి తాను కూడా సమంత , అనుష్క మరియు నయనతార లాగ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పనికొస్తానని ఈ వెబ్ సిరీస్ ద్వారా నిరూపించింది.