Project K: ప్రభాస్ గత రెండు చిత్రాలు నిరాశపరిచాయి. టీజర్ చూశాక… ఆదిపురుష్ పై నమ్మకాలు పోయాయి. ఆదిపురుష్ రూపంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా ప్లాప్ ఇస్తున్నట్లు జనాలు ఫిక్స్ అయ్యారు. సాహో కొంతలో కొంత పర్లేదు అనిపించింది. కనీసం హిందీ వర్షన్ హిట్ కొట్టింది. రాధే శ్యామ్ ఆల్ టైం డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. భారీ ధరలకు కొన్న బయ్యర్లు నిండా మునిగారు. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్, మార్కెట్ కి ఢోకా లేదని తెలుస్తుంది. ప్రాజెక్ట్ కే షూటింగ్ సగం కూడా కాలేదు. విడుదలకు ఒకటి నుండి రెండేళ్ల సమయం ఉంది.

అప్పుడే ప్రాజెక్ట్ కే కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారట. మేకర్స్ నైజాం డీల్ క్లోజ్ చేశారట. ఏషియన్ సునీల్ దాదాపు రూ. 70 కోట్లకు ప్రాజెక్ట్ కే నైజాం రైట్స్ సొంతం చేసుకున్నారట. సునీల్ ఆధ్వర్యంలోని సిండికేట్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని కొన్నారట. దగ్గుబాటి సురేష్, దిల్ రాజు, అల్లు అరవింద్ లు ఈ సిండికేట్ లో భాస్వాములు అన్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే నైజాం కొనుగోలు విషయంలో వీరందరూ భాగమయ్యారా? కొందరు భాగస్వాములా? అనేది తెలియాల్సి ఉంది.
ఇక నైజాంలో ప్రాజెక్ట్ కే టార్గెట్ ఫిక్స్ అయ్యింది. కనీసం రూ. 71 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. బాహుబలి 2 నైజాం వసూళ్లు రూ. 66 కోట్లు షేర్ మాత్రమే. అంటే ప్రభాస్ ప్రాజెక్ట్ కే బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేయాల్సి ఉంది. రాధే శ్యామ్ ఏపీ/తెలంగాణా కలిపి రూ.54 కోట్ల షేర్ రాబట్టింది. ఈ లెక్కలు పరిశీలిస్తే ప్రాజెక్ట్ కే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత పెద్ద విజయం సాధించాలో అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రాజెక్ట్ కే బడ్జెట్ రూ. 500 కోట్లు పైమాటే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై. అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. దిశా పటాని మరో హీరోయిన్. అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు. న్యూ ఇయర్ పురస్కరించుకొని మేకింగ్ వీడియో విడుదల చేశారు. మూవీలో వాడే ఒక టైర్ ని రోజుల తరబడి ప్రత్యేకంగా తయారు చేసినట్లు తెలుస్తుంది.