
Modi blue jacket: ప్రకృతిని ప్రేమిస్తామంటూ భీషణ ప్రతిజ్ఞలు చేయడమే కాదు.. దాన్ని ఆచరణలో పెట్టేవారే ధీరులు. ఆ విషయంలో ప్రధాని నరేంద్రమోడీని అభినందించాల్సిందే. ఎప్పుడూ విదేశాల్లో, దేశంలో వాతావరణ మార్పులపై మోడీ స్పందిస్తుంటారు. అలా చేయాలి? ఇలా చేయాలని ప్రజలను కోరుతుంటారు.కానీ తనే ఆచరించి ఇప్పుడు అందరికీ స్ఫూర్తిని పంచాడు.
వాతావరణ మార్పులపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. 2019లో మహాబలిపురంలోని ఒక బీచ్‌లో చెత్త ఏరుతూ మోడీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. బుధవారం, ప్రధాని మోడీ వాతావరణంపై తనకున్న ప్రేమను.. పర్యావరణంపై శ్రద్ధను చాటారు. ఈ మేరకు పార్లమెంట్ వేదికగా ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు.
పర్యావరణ హితాన్ని కోరుకుంటూ ప్రధాని మోడీ ఈరోజు నీలిరంగు జాకెట్‌ను ధరించి పార్లమెంట్ కు వచ్చాడు. ఈ జాకెట్ ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే అది రీసైకిల్ చేయబడిన పెట్ బాటిళ్లతో తయారు చేయబడింది. ప్రకృతిని నాశనం చేస్తున్న ఈ పెట్ బాటిళ్లు, ప్లాస్టిక్ ను రిసైకిలింగ్ చేసి ఈ జాకెట్ తయారు చేశారు. దీనివల్ల ప్రకృతికి మేలు జరుగుతుంది. అలాగే మనకు దుస్తులుగా ఉపయోగపడుతుంది.
బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని మోదీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ జాకెట్‌ను బహుకరించింది. ఈ ఉద్యోగులు మరియు సాయుధ దళాల కోసం స్థిరమైన వస్త్రాలను తయారు చేయడానికి 10 కోట్ల కంటే ఎక్కువ పెట్ సీసాలు రీసైకిల్ చేసి ఈ జాకెట్లు తయారు చేశారు.

బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సమర్పించేందుకు ప్రధాని మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ నీలి జాకెట్ కూడా రీసైకిల్ చేసిన పెట్ బాటిళ్ల నుంచి తయారు చేసిందే. దీని ఖరీదు కట్టలేరు. ఎందుకంటే ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మోడీ కోసం స్వయంగా తయారు చేయించి ఇచ్చింది. ఇలా వాతావరణ మార్పులు, పర్యావరణ హితంపై మాటలు చెప్పడమే కాదు.. మోడీ చేసి నిరూపించి పార్లమెంట్ వేదికగా ప్రజలందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు.
🚨 PM Modi in Karnataka!
Indian oil corp presents 'Modi Jacket' to PM Modi made out of recycled PET Bottles.
More than 10 crore PET Bottles will be recycled to make sustainable garments to India Oil employees and Armed Forces!#IndiaEnergyWeek2023 pic.twitter.com/kSQVI7REk4
— Karthik Reddy (@bykarthikreddy) February 6, 2023