Priest arrested : అది 1996 కాలం.. ఒకరకంగా అప్పట్లో టెక్నాలజీ ఈ స్థాయిలో అందుబాటులో లేదు. ఆ కాలంలో ప్రభుదాస్ సాధు అనే వ్యక్తి తన స్నేహితుడిని అంత మొందించాడు. ఈ ఘటనలో అప్పటి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. పలుమార్లు విచారణ జరిగింది. ఆ తర్వాత ప్రభుదాస్ సాధు తన వ్యక్తిగత లాయర్ ద్వారా బెయిల్ సాధించాడు. 1996లో అరెస్టు అయిన అతడు.. రెండు సంవత్సరాల తర్వాత అంటే 1998లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోకుండా పరారయ్యాడు. ఆ తర్వాత అతడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. గడ్డం జుట్టు బాగా పెంచి పటాన్ ప్రాంతంలో ఓ గుడిలో పూజారిగా పనిచేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం అతడి వయసు 61 సంవత్సరాలు. ఈ క్రమంలో పోలీసులకు 1996లో జరిగిన ఓ పెళ్లికి సంబంధించి వీడియో క్యాసెట్ చూస్తుండగా అందులో ప్రభుదాస్ కనిపించాడు. అందులో ఉన్న ఆధారాల ప్రకారం పోలీసులు ఆరా తీశారు. ఆ తర్వాత ప్రభుదాసు ఆచూకీ తెలుసుకున్నారు. అతడు ఉంటున్న ప్రాంతం వద్దకు వెళ్లి అరెస్ట్ చేశారు.
Also Read : 11 ఏళ్ల విద్యార్థితో యువ టీచర్ జంప్.. ఏకంగా నాలుగు రాష్ట్రాలు తిరిగి..
తప్పించుకుని తిరుగుతున్నాడు
1996 లో జరిగిన ఘటనకు సంబంధించి ప్రభుదాస్ జైలుకు వెళ్లాడు. అయితే నాటి కాలంలో అతని ఫోటో పోలీస్ అధికారుల వద్ద లేకపోవడంతో.. 1998లో బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ ప్రభుదాస్.. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోలేదు. తర్వాత ప్రాంతం మారి పూజారిగా అవతారం ఎత్తాడు. వివాహం కూడా చేసుకున్నాడు.. పిల్లలకు జన్మ కూడా ఇచ్చాడు. అయితే ఇటీవల పోలీసులు పాత కేసులను తవ్వుతుండగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అతడి ఆచూకీ గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా.. ఓ పెళ్లి వీడియో వారికి లభించింది. ఆ వీడియో చూడగా అందులో అతడు కనిపించాడు. ఆ తర్వాత వివిధ రకాల మార్గాల ద్వారా అతని గురించి తెలుసుకొని.. అనంతరం పఠాన్ ప్రాంతంలో గుడిలో పూజారిగా ఉన్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ” పెళ్లి వీడియో చూస్తుండగా ప్రభుదాస్ కనిపించాడు. అతని గురించి ఆచూకీ తీస్తుండగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అతడు పఠాన్ ప్రాంతంలో ఉండగా అరెస్టు చేశాం. గతంలో జరిగిన ఓ కేసుకు సంబంధించి అతడిని విచారించాల్సి ఉంది. అందులో కీలక విషయాలు వెల్లడించాల్సి ఉందని” పోలీసులు చెబుతున్నారు. కాగా, ఉన్నట్టుండి పోలీసులు పూజారిని అరెస్ట్ చేయడంతో పఠాన్ ప్రాంతంలోని స్థానికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. చివరికి పూజారి అసలు రంగు తెలుసుకొని ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. ఆ గుడికి అతడు అసలు రావద్దని తీర్మానం చేశారు.