
Priest Arrested: ఆయనో పూజారి. నిత్యం దేవున్ని కొలవడం ఆయన విధి. శ్లోకాలు, మంత్రాలు చదువుతూ దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే ఆయన ప్రధాన కర్తవ్యం. కానీ ఆయన బుద్ధి వక్రమార్గం పట్టింది. తాను ఓ పూజారిననే సంగతి మరిచిపోయాడు. కామాంధుడిలా మారాడు. అందమైన ఆడవారిపై కన్నేశాడు. ఆపై వారిని తనకు లోబరుచుకుని కోరికలు తీర్చుకున్నాడు. సాక్షాత్తు దైవ సన్నిధిలోనే అపవిత్ర కుట్రలకు ఆజ్యం పోశాడు. పూజారి వృత్తికే కళంకం తెచ్చాడు. పూజలు చేసే వారిని ఎంతో దైవాంశ సంభూతులుగా భావిస్తారు. అలాంటి వృత్తినే అపవిత్రం చేశాడు. మాయమాటలతో లొంగదీసుకుని తన శారీరక వాంఛలు తీర్చుకున్నాడు.
మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలోని ఆస్ బెస్టాస్ కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా పనిచేసే వెల్పూరి రాములు దురాగాతాల గురించి బయట తెలియడంతో అందరు అవాక్కవుతున్నారు. పంతులు ఇలాంటి పనిచేశాడా అని ఆశ్చర్యపోతున్నారు. నిత్యం వేద మంత్రాలు చదివే వ్యక్తి ఇంతటి దర్మార్గానికి ఒడిగట్టాడా? అని అనుకుంటున్నారు. దైవ దర్శనానికి వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని రాములు మాయమాటలు చెప్పేవాడు. వారిని నమ్మించి వారితో శారీరక కోరికలు తీర్చుకునేవాడు.
కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యవహారం ఓ మహిళ వల్ల రట్టయింది. పూజారి బాగోతం వెలుగు చూసింది. వారితో రాసలీలలు సాగించడంతో పాటు వారి ఆస్తులను కొట్టేయాలని పథకం పన్నాడు. ఇది గమనించిన మహిళ ఫిర్యాదుతో పూజారి బాగోతాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. పూజల పేరుతో మహిళలను పక్కదారి పట్టించి లైంగికంగా వేధించిన నీచుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పవిత్రమైన వృత్తిలో అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన పంతులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడటంపై విమర్శలు వస్తున్నాయి. పూజారులంటే కూడా గౌరవం పోయేలా ప్రవర్తించాడు. శారీరక కోరికలు తీర్చుకోవడమే కాకుండా వారి ఆస్తులను కాజేయాలని కుట్ర చేయడం మరో కోణం. ఇలాంటి చండాలమైన గుణాలు కలిగిన పూజారిపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికి మంచి చేసే పనిలో ఉంటూ కీడు చేసిన అతడిని అసహ్యించుకుంటున్నారు. పూజారి వృత్తికే మచ్చతెచ్చాడని వాపోతున్నారు.