
Singer Sunitha: 42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని సంచలనం రేపింది సింగర్ సునీత. 2021 జనవరిలో సునీత మాంగో మీడియా అధినేత, బిజినెస్ మాన్ రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. సునీత వివాహం అప్పట్లో సంచలనం రేపింది. ఆమెకున్న ఇమేజ్ రీత్యా అది ఊహించని పరిమాణం. 20 ఏళ్ళ కొడుకు ఉండగా మరో వివాహం చేసుకుంటారని ఎవరూ ఊహించరు కదా. అందుకే విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు పరుష వ్యాఖ్యలు చేశారు.
Also Read: Anasuya Bharadwaj: బావను వాడు వీడు అంటావా చెప్పుతో కొడతా… తమ్ముడితో పబ్లిక్ లో గొడవకు దిగిన అనసూయ
సునీత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబం, పిల్లల భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయం. ఈ వివాహానికి ఫ్యామిలీ మెంబర్స్ అనుమతి ఉందన్నారు. ఎప్పటిలానే నా నిర్ణయాన్ని గౌరవించి మద్దతుగా నిలవాలని అభ్యర్ధించారు. కొందరు సెలెబ్రిటీలు సునీతకు సప్పోర్ట్ గా నిలిచారు. విమర్శించే వాళ్ళపై ఫైర్ అయ్యారు. పెళ్లి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారం. అసలు మీకేం సంబంధం అని మండిపడ్డారు.
రామ్ తో వివాహం అనంతరం సునీత లైఫ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆమె ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడ్డారు. ఇద్దరు పిల్లల్ని సెటిల్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఓ మూవీ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సునీత భర్త రామ్ నిర్మాతగా ఉన్నారని సమాచారం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది విడుదల కానుంది. కూతురు శ్రేయ తల్లి బాటలో నడుస్తుంది. ప్లే బ్యాక్ సింగర్ కావాలనుకుంటుంది.

తరచుగా సునీత మీద రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఆమె గర్భవతి అయ్యారనేది ఒకటి. ఈ వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఓ మ్యూజికల్ ఈవెంట్ ప్రమోషన్స్ కోసం ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీరు తల్లయ్యారంటూ ఒక ప్రచారం జరుగుతుంది… దీనికి మీ స్పందన ఏంటి? అనగా. ఈ పుకారు నా వరకు రాలేదు. నేను తల్లిని అయ్యాననేది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించిన విషయం. నాకు గానీ, నా జీవితానికి గానీ సంబంధించింది కాదు, అన్నారు. పరోక్షంగా ఆమె ఈ వార్తలను ఖండించారు. దీంతో సునీత తల్లయ్యారన్న వార్తలకు చెక్ పడింది.