
Prabhas: ఏ హీరోకైనా రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చెయ్యడం చాలా కష్టం, అలాంటిది ప్రభాస్ ఏకంగా మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు..ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్, నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K మరియు మారుతీ ‘రాజా డీలక్స్’..ఈ మూడు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ గత కొంతకాలం నుండి జరుగుతూనే ఉన్నాయి.అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఆ షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయట.అందుకు కారణం ఆయన హై టెంపరేచర్ తో జ్వరం ఉండడమే.
Also Read: Rahul- Gill: ఫామ్‌లేని ప్లేయర్‌కు టీమిండియాలో స్థానం.. సెంచరీల హీరోకు అన్యాయం..!
రెండు మూడు రోజులైనా తగ్గకపొయ్యేసరికి, ఇటీవలే డాక్టర్ ని కలవగా , కచ్చితంగా కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం అని చెప్పడం తో , ప్రభాస్ షూటింగ్స్ ఆపేసాడని అంటున్నారు.మళ్ళీ ఆయన పూర్తి గా కోలుకునేంత వరకు షూటింగ్స్ లో పాల్గొనడట.ఈ వార్త బయటకి రావడం తో ప్రభాస్ ఆరోగ్యం ఎలా ఉందో అని అభిమానులు భయపడుతున్నారు.
బాహుబలి సమయం లో కూడా ప్రభాస్ కి ఇలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తాయి, రిస్కీ స్తంట్స్ చేసి భుజాలు విరగొట్టుకొని సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది,ఇప్పుడు కూడా విజయాంతి లేకుండా నాన్ స్టాప్ గా మూడు సినిమాల్లో ఒకేసారి నటిస్తుండడం వల్లే హై ఫీవర్ వచ్చిందని అంటున్నారు డాక్టర్లు.నిన్న మొన్నటి వరకు ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్ లోనే పాల్గొంటూ వస్తున్నాడు.

ఈ నెల మొత్తం వేరే సినిమాలకు మారకుండా సలార్ చిత్రానికి మాత్రమే డేట్స్ కేటాయించాడట ప్రభాస్, కానీ ఇంతలోపే ఇలా జరగడం తో కేవలం సలార్ షెడ్యూల్స్ మాత్రమే కాదు, మిగిలిన మూడు సినిమాల షెడ్యూల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయట,ఈ మూడు సినిమాలతో పాటు ప్రభాస్ ‘ఆది పురుష్’ అనే చిత్రం చేసాడు..ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది, గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే ప్రస్తుతం జరుగుతుందట.
Also Read:Rakhi Sawant- Adil Khan: ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను అరెస్ట్ చేయించిన హీరోయిన్