Prabhas :యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ఇండియా స్టార్. అతడి సినిమాలకు తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. సాహో, రాధేశ్యామ్ తర్వాత వరుసగా సినిమాలు పట్టాలెక్కించి దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కే’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ మూవీ నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ నిర్మించిన చిన్న చిత్రం ‘సీతారామం’కు ప్రభాస్ గెస్ట్ గా వస్తాడని ప్రకటించినా చివరి నిమిషంలో ప్రభాస్ హాజరు కాలేదు. అసలు ప్రభాస్ కు ఏమైంది? ఎందుకు రాలేదన్నది హాట్ టాపిక్ గా మారింది.
‘సీతారామం’ చిత్రం నిర్మించిన వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ కు అర్జంట్ గా సర్జరీ అవసరం కావడంతో ఆయన విదేశాలకు వెళ్లాడని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. అందుకే ‘సీతారామం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రాలేకపోయాడని క్లారిటీ ఇచ్చారు.
ఈ ఏడాది మార్చిలోనే ప్రభాస్ కు సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఇప్పుడు మరో ఆపరేషన్ అనేసరికి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రభాస్ కు ఏమైంది? ఆ సర్జరీ ఎందుకు అవసరం పడింది? అని అందరూ కంగారుపడుతున్నారు.
Also Read: Sudigali Sudheer Jabardast Re-Entry: జబర్ధస్త్ లోకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ వెనుక ఉన్నదెవరు?
ప్రభాస్ కాలికి చిన్న సర్జరీ జరుగుతోందని.. ఇందుకోసమే ఆయన విదేశాలకు వెళ్లాడని తెలిపారు. అదేమంత పెద్ద గాయం ఏమీ కాదని వివరించారు.
కాగా ‘సలార్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ గాయపడినట్లు చెబుతున్నారు. చికిత్స కోసమే స్పెయిన్ దేశానికి వెళ్లి ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. బార్సిలోనాలో కాలికి సర్జరీ చేయించుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైద్యుల సూచన మేరకు ప్రభాస్ విదేశాల్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది.
అయితే ప్రభాస్ ఆ మధ్య మద్యం అలవాటు బాగా అయ్యిందని.. దాని వల్ల ఫిజిక్ కూడా దెబ్బతిందని.. బరువు పెరగడంతో చికిత్స కోసం విదేశాలకు వెళ్లాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ మధ్యలో ప్రభాస్ ఫారెన్ వెళ్లడంతో అందరూ అదే అనుమానిస్తున్నారు.
ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ జనవరిలో పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందని అశ్వినీదత్ తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ లేదా.. 2024 సంక్రాంతికి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Chanakya Niti: చాణక్య నీతి: మగవాడి జీవితాన్ని విచారకంగా మార్చేవి ఏంటి?