Homeఎంటర్టైన్మెంట్Prabhas Srinu: నమ్మి పక్కన పెట్టుకున్నందుకు ప్రభాస్ వీక్నెస్ లీక్ చేసిన ప్రభాస్ శ్రీను 

Prabhas Srinu: నమ్మి పక్కన పెట్టుకున్నందుకు ప్రభాస్ వీక్నెస్ లీక్ చేసిన ప్రభాస్ శ్రీను 

Prabhas Srinu: నటుడు ప్రభాస్ శ్రీను అంటే తెలియనివారుండరు. సీతయ్య మూవీతో వెండితెరకు పరిచయమైన ఈ కమెడియన్… విక్రమార్కుడు, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. ప్రభాస్ మిత్రుడైన శ్రీను అతని అసిస్టెంట్ గా చేరి ప్రభాస్ శ్రీనుగా పాప్యులర్ అయ్యారు. ప్రభాస్ తో పాటు శ్రీను యాక్టింగ్ నేర్చుకున్నాడు. అప్పటి వారి పరిచయం కొనసాగింది. ప్రభాస్ స్టార్ అయ్యాక పక్కనే ఉంచుకుని అతన్ని నటుడ్ని చేశాడు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో ప్రభాస్ శ్రీను నటించాడు. అయితే ఒక దశలో ప్రభాస్ శ్రీనును ప్రభాస్ దూరం పెట్టాడనే పుకారు వినిపించింది.

Prabhas Srinu
Prabhas Srinu

ప్రభాస్ శ్రీను తన పేరు చెప్పుకొని చెడ్డ పనులు చేస్తున్నాడని… అది తెలిసిన ప్రభాస్ కోప్పడి తన వద్ద నుండి పంపించేశాడనే వాదన ఉంది. ప్రభాస్ నటించిన కొన్ని చిత్రాల్లో ప్రభాస్ శ్రీను కనిపించకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఏది ఏమైనా ప్రభాస్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రభాస్ శ్రీను అంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మిత్రుడు ప్రభాస్ బలహీనతలు బయటపెట్టాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రభాస్ బలహీనత అతని మంచితనమే అన్నారు. ఆయన ఎవరినైనా తేలికగా నమ్మేస్తాడు. అయితే ప్రభాస్ తో విరోధం మంచిది కాదు. ప్రభాస్ నవ్వు ఎంత అందంగా ఉంటుందో మౌనం అంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి విబేధం తలెత్తితే అతనితో ఇక కలవడానికి ఇష్టపడడు. జీవితాంతం దూరం పెట్టేస్తాడు. అందుకే ప్రభాస్ తో ఎవరూ గొడవ పెట్టుకోరని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ప్రభాస్ కి ఉన్న మరొక బలహీనత ఆయన అప్డేట్ అవ్వడానికి ఇష్టపడరట. ఎప్పుడూ ఒకేలా ఉంటారట. పరిస్థితులకు అనుగుణంగా మారడం ప్రభాస్ కి అలవాటు లేదని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.

Prabhas Srinu
Prabhas Srinu

ఇటీవల సీనియర్ నటి తులసీతో పాటు ఆలీతో సరదాగా షోకి ప్రభాస్ శ్రీను వచ్చాడు. ఇద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తులసీ-ప్రభాస్ శ్రీను మధ్య ఎఫైర్ నడుస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. ఆలీ షోలో వారి ప్రవర్తన కూడా అలానే ఉంది. ఇక తులసి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టారు. బాలనటిగా ఆమె రెండు జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం. సీతామాలక్ష్మి, శంకరాభరణం చిత్రాలకు తులసి నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version