Prabhas Srinu: నటుడు ప్రభాస్ శ్రీను అంటే తెలియనివారుండరు. సీతయ్య మూవీతో వెండితెరకు పరిచయమైన ఈ కమెడియన్… విక్రమార్కుడు, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. ప్రభాస్ మిత్రుడైన శ్రీను అతని అసిస్టెంట్ గా చేరి ప్రభాస్ శ్రీనుగా పాప్యులర్ అయ్యారు. ప్రభాస్ తో పాటు శ్రీను యాక్టింగ్ నేర్చుకున్నాడు. అప్పటి వారి పరిచయం కొనసాగింది. ప్రభాస్ స్టార్ అయ్యాక పక్కనే ఉంచుకుని అతన్ని నటుడ్ని చేశాడు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో ప్రభాస్ శ్రీను నటించాడు. అయితే ఒక దశలో ప్రభాస్ శ్రీనును ప్రభాస్ దూరం పెట్టాడనే పుకారు వినిపించింది.
ప్రభాస్ శ్రీను తన పేరు చెప్పుకొని చెడ్డ పనులు చేస్తున్నాడని… అది తెలిసిన ప్రభాస్ కోప్పడి తన వద్ద నుండి పంపించేశాడనే వాదన ఉంది. ప్రభాస్ నటించిన కొన్ని చిత్రాల్లో ప్రభాస్ శ్రీను కనిపించకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఏది ఏమైనా ప్రభాస్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రభాస్ శ్రీను అంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మిత్రుడు ప్రభాస్ బలహీనతలు బయటపెట్టాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ప్రభాస్ బలహీనత అతని మంచితనమే అన్నారు. ఆయన ఎవరినైనా తేలికగా నమ్మేస్తాడు. అయితే ప్రభాస్ తో విరోధం మంచిది కాదు. ప్రభాస్ నవ్వు ఎంత అందంగా ఉంటుందో మౌనం అంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి విబేధం తలెత్తితే అతనితో ఇక కలవడానికి ఇష్టపడడు. జీవితాంతం దూరం పెట్టేస్తాడు. అందుకే ప్రభాస్ తో ఎవరూ గొడవ పెట్టుకోరని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ప్రభాస్ కి ఉన్న మరొక బలహీనత ఆయన అప్డేట్ అవ్వడానికి ఇష్టపడరట. ఎప్పుడూ ఒకేలా ఉంటారట. పరిస్థితులకు అనుగుణంగా మారడం ప్రభాస్ కి అలవాటు లేదని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.
ఇటీవల సీనియర్ నటి తులసీతో పాటు ఆలీతో సరదాగా షోకి ప్రభాస్ శ్రీను వచ్చాడు. ఇద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తులసీ-ప్రభాస్ శ్రీను మధ్య ఎఫైర్ నడుస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. ఆలీ షోలో వారి ప్రవర్తన కూడా అలానే ఉంది. ఇక తులసి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టారు. బాలనటిగా ఆమె రెండు జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం. సీతామాలక్ష్మి, శంకరాభరణం చిత్రాలకు తులసి నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు.