https://oktelugu.com/

Prabhas Health : ప్రభాస్ కి తీవ్ర అనారోగ్య సమస్యలు..? రిస్క్ లో రెండు వేల కోట్లు!

Prabhas Health : ప్రభాస్ ఆరోగ్యం పై చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ కి వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఈ క్రమంలో కొన్ని రోజులు ప్రభాస్ సెట్స్ పై ఉన్న చిత్రాలకు విరామం ప్రకటిస్తున్నారట. టాలీవుడ్ లో ఈ మేరకు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గతంలో రెండు మూడు సార్లు ట్రీట్మెంట్ కోసం ప్రభాస్ ఫారిన్ వెళ్లారు. ఈ […]

Written By: , Updated On : March 15, 2023 / 07:56 PM IST
Follow us on

Prabhas Health : ప్రభాస్ ఆరోగ్యం పై చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ కి వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఈ క్రమంలో కొన్ని రోజులు ప్రభాస్ సెట్స్ పై ఉన్న చిత్రాలకు విరామం ప్రకటిస్తున్నారట. టాలీవుడ్ లో ఈ మేరకు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గతంలో రెండు మూడు సార్లు ట్రీట్మెంట్ కోసం ప్రభాస్ ఫారిన్ వెళ్లారు. ఈ మధ్య తరచుగా ఆయన అనారోగ్యం బారినపడుతున్నారు. రాజా డీలక్స్ సెట్స్ లో ప్రభాస్ కి జ్వరం వచ్చింది. ప్రభాస్ హెల్త్ రీజన్స్ తో షూటింగ్ ఆపేశారు.

తాజాగా మరోసారి హెల్త్ ప్రాబ్లం రావడంతో విదేశాలకు వెళ్లారు. ప్రభాస్ ఫారిన్ టూర్ షూటింగ్స్ లో భాగమని మొదట భావించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ చిత్రాల షూటింగ్స్ ఇండియాలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఆయన విదేశాలకు వెళ్లిన కారణం హెల్త్ చెకప్ కోసమని తెలిసింది. రెగ్యులర్ చెకప్ కాబట్టి సమస్య ఏం లేదు. తిరిగి ప్రభాస్ షూటింగ్స్ లో యథావిధిగా పాల్గొంటారని మేకర్స్ భావించారు. అయితే వైద్యులు మాత్రం కొంత కాలం రెస్ట్ అవసరమని చెప్పారట.

ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల షూటింగ్స్ కి బ్రేక్ పడనుంది అంటున్నారు. అదే జరిగితే… విడుదల తేదీలు మారిపోతాయి. బడ్జెట్ లెక్కలు తారుమారవుతాయి. ఆదిపురుష్ చిత్ర షూటింగ్ కంప్లీటైన తరుణంలో ఆ ప్రాజెక్ట్ సేఫ్. చెప్పినట్లే ఆదిపురుష్ జూన్ నెలలో విడుదల అవుతుంది. సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలు భారీగా నష్టపోయే సూచనలు కలవు. సలార్ షూట్ చివరి దశకు చేరుకుంది. ఇక ప్రాజెక్ట్ కే చిత్రీకరణ మధ్యలో ఉంది. సెప్టెంబర్ లో సలార్ విడుదల కానుంది. ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతి కానుకగా ప్రకటించారు.

సందీప్ రెడ్డి వంగాతో ప్రకటించిన స్పిరిట్ మూవీ కూడా కలుపుకుంటే ప్రభాస్ సైన్ చేసిన చిత్రాల బడ్జెట్ దాదాపు రెండు వేల కోట్లు. ప్రభాస్ అనారోగ్యం కారణంగా ఇంత బడ్జెట్, భారీ చిత్రాలు రిస్క్ లో పడతాయి. ముఖ్యంగా సెట్స్ పైకి వెళ్లిన చిత్రాలు ఆలస్యం అయ్యే కొద్దీ నిర్మాతలపై భారం పెరిగిపోతుంది. ప్రభాస్ ఆరోగ్యం మీద వస్తున్న పుకార్లు భయపెడుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇవన్నీ నిరాధార కథనాలు కూడా కావచ్చు.