https://oktelugu.com/

Prabhas Rajamouli : ఆర్ఆర్ఆర్ లో నన్ను ఎందుకు తీసుకోలేదు: ప్రభాస్ ప్రశ్నకు రాజమౌళి షాకింగ్ ఆన్సర్

Prabhas Rajamouli : బాహుబలితో ప్రభాస్ ను ప్యాన్ఇండియా స్టార్ ను చేసిన రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేశాడు రాజమౌళి. ఇందులో పలు సంచలన విషయాలు వెల్లడించారు. బాహుబలి నుంచి రాధేశ్యామ్ వరకూ ప్రభాస్ మారిన తీరును రాజమౌళి కొనియాడారు. బాహుబలి వేళ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తటపటాయించిన ప్రభాస్ ఇప్పుడు సొంతంగా సినిమాకు ప్రమోషన్ చేస్తున్న తీరును […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2022 / 10:23 PM IST
    Follow us on

    Prabhas Rajamouli : బాహుబలితో ప్రభాస్ ను ప్యాన్ఇండియా స్టార్ ను చేసిన రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేశాడు రాజమౌళి. ఇందులో పలు సంచలన విషయాలు వెల్లడించారు. బాహుబలి నుంచి రాధేశ్యామ్ వరకూ ప్రభాస్ మారిన తీరును రాజమౌళి కొనియాడారు. బాహుబలి వేళ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తటపటాయించిన ప్రభాస్ ఇప్పుడు సొంతంగా సినిమాకు ప్రమోషన్ చేస్తున్న తీరును రాజమౌళి ప్రశంసించారు.

    ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో తనను ఎందుకు అతిథి పాత్రలోనైనా తీసుకోవాలనిపించలేదని రాజమౌళిని ప్రభాస్ అడిగాడు. దీనికి రాజమౌళి ఆసక్తికరంగా స్పందించాడు. ‘నువ్వు పెద్ద ఓడలాంటి వాడివి. నిన్ను చూపించడం కోసం ఆర్టిఫిషియల్ సీన్స్ క్రియేట్ చేయకూడదు. సినిమాకు అవసరం అనుకుంటే నిన్ను ఏదో ఒక రకంగా ఒప్పించి తీసుకువచ్చేస్తా’ అంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

    ఇక మా ఫ్యామిలీలోని 44 మంది ఉన్న వాట్సాప్ గ్రూపులో ఏ సినిమాకు 35 మంది మించి రాలేదని..కానీ రాధేశ్యామ్ కు మాత్రం అందరం కలిసి 44 మంది వెళుతున్నామని.. రాధేశ్యామ్ చూశానని.. అద్భుతంగా వచ్చిందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. రాధేశ్యామ్ లో ట్రైన్, షిప్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయని.. తాను సినిమా చూశానని రాజమౌళి అన్నారు.

    ఇక ప్రభాస్ పెళ్లి గురించి ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చింది. నేను నీ పెళ్లి గురించి ఏం అడగలేదని.. సాధారణంగానే అడిగానని.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని రాజమౌళి ఆప్యాయంగా అడిగాడు. దీనికి ప్రభాస్ నవ్వుతోనే సమాధానం ఇచ్చాడు.